India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 70 వేలకుపైగా కేసులు, వేయికి చేరువలో మరణాలు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కేసులతోపాటు Covid-19 రికవరీ రేటు కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య 68 లక్షల మార్క్ దాటింది. అయితే.. గత 24గంటల్లో బుధవారం ( అక్టోబరు 7న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 78,524 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 971 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 68,35,656 కి చేరగా.. మరణాల సంఖ్య 1,05,526 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Sasikala: చిన్నమ్మకు భారీ షాక్.. 2వేల కోట్ల ఆస్తుల జప్తు
ప్రస్తుతం దేశంలో 9,02,425 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 58,27,705 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 85.25 శాతం ఉండగా.. మరణాల రేటు 1.54 శాతం, యాక్టివ్ కేసుల రేటు 13.20 శాతం ఉందని వైద్యశాఖ వెల్లడించింది. Also read; Jawahar Reddy is new TTD EO: టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి.. ఉత్తర్వులు జారీ
ఇదిలాఉంటే.. బుధవారం దేశవ్యాప్తంగా 11,94,321 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో అక్టోబరు 7 వరకు మొత్తం 8,34,65,975 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. Also read: Pralhad Joshi: మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్