Lalu security tested Covid-19 positive: పాట్నా: దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) విలయతాండవం చేస్తోంది. సాధరణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. దీంతోపాటు వారికి రక్షణగా ఉండే పోలీసు సిబ్బంది కూడా కరోనాకు గురవుతున్నారు. తాజాగా ఆర్జేడీ (RJD) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ( Lalu Prasad Yadav ) వ్యక్తిగత భద్రత సిబ్బందిలోని తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలు ప్రసాద్ యాదవ్‌కు తీవ్ర అనారోగ్యం కారణంగా రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే.. లాలు ప్రసాద్ యాదవ్‌కు కరోనా లక్షణాలేవీ లేవని ఆసుపత్రి అధికారులు తెలిపారు. Also read: India: 29లక్షలు దాటిన కరోనా కేసులు
ముందుగా లాలుకు సేవలందిస్తున్న ముగ్గురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత ఆసుపత్రి బయట ఆయనకు రక్షణగా ఉన్న పర్సనల్ భద్రతా సిబ్బంది తొమ్మిది మంది జవాన్లు కరోనా బారిన పడ్డారని చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించినట్లు రిమ్స్ డైరెక్టర్ వివేక్ కశ్యప్ తెలిపారు. వారి స్థానంలో వేరే భద్రతా సిబ్బందిని మోహరించాలని ఆయన అధికారులకు తెలియజేశారు. Also read: Fire Accident: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం