న్యూఢిల్లీ: శనివారం రాహుల్ గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అధికారికంగా పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి రెండు రోజుల ముందే రాహుల్ గాంధీని అధికారికంగా పార్టీ చీఫ్ గా నియమిస్తున్నారు.
రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పిసీసీ ప్రతినిధులు తదితరులు హాజరవుతారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి మల్లాపల్లి రామచంద్రన్ డిసెంబర్ 11 తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే..!
పార్టీ పగ్గాలు చేపట్టాక రాహుల్, తన పార్టీ పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని ప్రసంగించారు. రాహుల్ గాంధీ 2013 నుండి నాలుగు సంవత్సరాలుగా పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల పోటీతో పాటు, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం రాహుల్ ముందున్న ప్రధాన సవాళ్ళు.
ఇదిలా ఉండగా, 'సోనియా గాంధీ తన పదవీ విరమణకు సమయం ఆసన్నమైందని.. ఆమె భవిష్యత్ ప్రణాళికల గురించి వెనువెంటనే ఊహాగానాలు చేశారని, కానీ.. ఆవిడ పార్టీ పార్టీ చీఫ్ పదవి నుంచి రిటైర్ అయ్యారని, రాజకీయాల నుంచి కాదు' అని కాంగ్రెస్ పార్టీ పేర్కొనింది.
132 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నికైన సోనియా గాంధీ 19 ఏళ్లపాటు నడిపించారు. 2004, 2009 సాధారణ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.