Union minister's tested covid-19 negative: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) బారిన సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. కరోనా బారిన పడి ఇటీవలనే హోంమంత్రి అమిత్ షా సైతం డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన మరో కేంద్ర మంత్రి సైతం సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. కేంద్ర నీటి వనరుల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ( Arjun Ram Meghwal ) ఈ నెల 8వ తేదీన కరోనా బారిన పడి. ఢిల్లీలోని ఎయిమ్స్ ( AIIMS ) లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కరోనా రిపోర్ట్ నెగిటివ్ రాగా.. సోమవారం డిశ్చార్జ్ అయినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. వైద్యుల సలహా మేరకు కొన్ని రోజులపాటు హోం ఐసోలేషన్లో ఉండనున్నట్లు ఆయన తెలిపారు. తనకు చికిత్స అందించిన వైద్యులు, నర్సులు, తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన శ్రేయోభిలాశులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. Also read: Navneet Kaur: కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్న నవనీత్ కౌర్
मैं COVID19 से ठीक होकर आज AIIMS से डिस्चार्ज हो गया हूँ।चिकित्सकीय सलाह पर मैं कुछ दिन तक होम आइसोलेशन में रहूंगा।मैं डॉक्टर्स नर्सेज़ व उनकी पूरी टीम को धन्यवाद देता हूँ।आप सभी शुभचिंतकों ने मेरे स्वास्थ्य लाभ हेतु प्रार्थना की, इसके लिए मैं आपका आभारी रहूंगा।
— Arjun Ram Meghwal (@arjunrammeghwal) August 17, 2020
అయితే.. గతనెలలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ‘భాభిజీ’ పేరుతో అప్పడాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. ఈ అప్పడాలను తింటే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు తయారవుతాయని ఆయన పేర్కొన్నారు. Also read: JEE, NEET: పరీక్షలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్