Trains cancelled: మరోసారి దేశవ్యాప్తంగా రైళ్లు రద్దు

Indian Railways cancelled trains: ఇండియన్ రైల్వే మరోసారి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. రెగ్యులర్ రైళ్లు, మెయిల్, ఎక్స్‌ప్రెస్, సబ్ అర్బన్ రైళ్లను రద్దు ( Trains cancelled ) చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని రైళ్లకు మాత్రం దీన్నించి మినహాయింపునిచ్చింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా సంక్రమణ ( coronavirus spread ) నేపథ్యంలో భారతీయ రైల్వే మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.

Last Updated : Jun 25, 2020, 11:23 PM IST
Trains cancelled: మరోసారి దేశవ్యాప్తంగా రైళ్లు రద్దు

Indian Railways cancelled trains: ఇండియన్ రైల్వే మరోసారి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. రెగ్యులర్ రైళ్లు, మెయిల్, ఎక్స్‌ప్రెస్, సబ్ అర్బన్ రైళ్లను రద్దు ( Trains cancelled ) చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని రైళ్లకు మాత్రం దీన్నించి మినహాయింపునిచ్చింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా సంక్రమణ ( coronavirus spread ) నేపథ్యంలో భారతీయ రైల్వే మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న రైళ్లను ఆగస్టు 12 వరకూ నిరవధికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో రెగ్యులర్‌గా నడిచే మెయిల్, ఎక్స్‌ప్రెస్, సబ్ అర్బన్ రైళ్లన్నీ ఉన్నాయి. అయితే  మే 12 నుంచి ప్రారంభమైన రాజధాని ఎక్స్‌ప్రెస్ ( Rajdhani Express ), జూన్ 1 నుంచి ప్రారంభమైన 230  ప్రత్యేక రైళ్లు ( 230 Special trains ) మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది. రద్దైన రైళ్లు తిరిగి ఎప్పట్నించి ప్రారంభమయ్యేది మరో ప్రకటన ద్వారా రైల్వే శాఖ స్పష్టం చేయనుంది. 

రిఫండ్ ఎలా ( Cancelled train tickets money refund ):
ఆన్‌లైన్ ద్వారా టికెట్ ( Online ticket booking ) బుక్ చేసుకున్నవారికి  సంబంధిత రిఫండ్ అమౌంట్ వారి ఖాతాల్లో ఆటోమేటిక్‌గా తిరిగి జమ అవుతుంది. జూలై 1 నుంచి ఆగస్టు 12 మధ్య కాలంలో ప్రయాణం కోసం టికెట్ బుక్ చేసుకున్నవారికి పూర్తిగా రిఫండ్ లభిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. రిఫండ్ ఎలా పొందాలనే దానిపై ఇప్పటికే జారీ అయిన గైడ్‌లైన్స్ ( Refund guidelines ) ప్రకారం ఉంటుంది. 

రైల్వే కౌంటర్ నుంచి టికెట్ బుక్ చేసుకున్న వారు ప్రయాణించే తేదీ నుంచి ఆరు నెలల్లోగా రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. టికెట్ డిపాజిట్ రిసీప్ట్‌ను ( TDR) సంబంధిత ప్యాసెంజర్ స్టేషన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. 

ఆన్‌లైన్‌ టికెట్ బుక్ చేసుకున్న వారికి ఆటోమెటిక్‌గా రిఫండ్ సంబంధిత ఖాతాలో జమ అవుతుంది. ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా గానీ లేదా 139 ద్వారా గానీ ప్యాసింజర్స్ తమ కౌంటర్ టికెట్లను రద్దు చేసుకోవచ్చు. మార్చ్ 21 నుంచి చేసే ప్రయాణం కోసం టికెట్లను ఇప్పటికే రద్దు చేసుకున్నవారు... మిగిలిన క్యాన్సిలేషన్ ఛార్జీల్ని పొందడానికి తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చునని భారతీయ రైల్వే స్పష్టంచేసింది.

Trending News