Free Chicken: బబర్డ్ ఫ్ల్యూ నేపథ్యంలో దానిపై అవగాహన కల్పించే యోచనలో భాగంగా ఫౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చికెన్ మేళాను నిర్వహించారు. అవును బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు చికెన్ తినాలంటే భయపడే పరిస్థితులు నెలకొంది. దీంతో చికెన్ వినియోగం దేశ వ్యాప్తంగా భారీగా తగ్గింది. దీంతో ఆయా రంగాలపై ఆధారపడిన వారిపై ప్రభావం పడుతోంది. ఆదివారం వచ్చిందంటే ఉదయం నుంచే చికెన్ సెంటర్లు రద్దీగా ఉండేవి. అంతేకాదు క్యూ లైన్లతో కిట కిట లాడేవి. ఇక సండే రోజు కూడా మటన్, ఫిష్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో పాటు కూరగాయలవైపు మళ్లుతున్నారు.
కానీ చికెన్ మాత్రం ముట్టుకోవడం లేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాలేదని ప్రకటించారు అధికారులు. చికెన్ తినొచ్చని సూచించారు. చికెన్ మేళాలు నిర్వహించి మరీ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. గుంటూరులోని పట్టాభిపురం స్వామి థియేటర్ గ్రౌండ్లో బర్డ్ ఫ్లూపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చికెన్ ఫుడ్ మేళాలో ఉచితంగా చికెన్ వంటకాలు పంపిణీ చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తినడం వల్ల ఇబ్బంది ఉండదని చెప్పేందుకే ఈ ఫుడ్ మేళా ఏర్పాటు చేశారు. ఇక, ఉచితంగా చికెన్ వంటకాల పంపిణీ అనేసరికి జనాలు భారీగా తరలివచ్చారు. ఫుడ్ మేళా ప్రాంగణం నిండిపోవడంతో నిర్వాహకులు గేట్లు మూసేయాల్సి వచ్చింది. అంతేకాదు ప్రజలు చికెన్ కోసం కొట్టుకోవడం విశేషం.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.