Indiramma Illu List2 Telangana 2025: ఎల్ 1 కేటగిరీ సొంత జాగా ఉండి, ఇల్లు కట్టుకునే వారి జాబితా. ఇక ఎల్ 2 సొంత ఇల్లు లేనివారికి ఇల్లు అందించడానికి తయారు చేసిన జాబితా. ఎల్3 పూర్తిగా పాడుబడ్డ పాత ఇల్ల జాబితా. అయితే, తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల్లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది.
ఎల్2 లో మీరు ఉందా? ఎల్1 లో మీ పేరు ఉందా? బెనిఫిషియరీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
ఇందిరమ్మ ఇల్లు పథకం ఇల్లు లేని పేదలకు సొంత ఇల్లు అందించడం. అంతేకాదు సొంత జాగా ఉండి కొన్ని ఏళ్లుగా ఇల్లు కట్టుకోలేని పేదలకు కూడా రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించడానికి 'ఇందిరమ్మ ఇళ్లు' పథకాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే, ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారిని మూడు కేటగిరీలుగా ఏఐ టెక్నాలజీ సహాయంతో తయారు చేశారు.
L1 లబ్దిదారుల జాబితా.. ఈ జాబితాలో ఉన్నవారు సొంత జాగా ఉన్నవారు. వీరు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.5 లక్షల సాయం అందించనుంది. ఇక L2 కేటగిరీలో ఉన్నవారంతా సొంత ఇల్లు లేనివారు. వీరికి సొంత ఇల్లు అందించడానికి కార్యాచరణ చేస్తోంది ప్రభుత్వం. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లకు పైగా బడ్జెట్లో కేటాయించింది.
ఇక సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు విడుదల చేయనుంది. ఇది మూడు నాలుగు దఫాల్లో విడుదల చేస్తారు. పూర్తి ఏఐ సాంకేతికతతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావు ఇవ్వకుండా చూస్తున్నారు. వీరికి ఇసుక కూడా ఉచితంగా అందించనున్నట్లు కూడా ఇటీవలె రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇందిరమ్మ ఇల్లు L2 లో మీ స్టేటస్ చెక్ చేసుకునే విధానం..
ఇందిరమ్మ ఇల్లు L2 లో మీ పేరు సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు.
ముందుగా అధికారిక వెబ్సైట్ Indiramma Illu ఓపెన్ చేయాలి. అందులో అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది. హోంపేజీలో ఉండే ఆ బట్టన్ ట్యాబ్ చేసి అక్కడ మీ ఆధార్ నంబర్ లేదా అప్లికేషన్ ఐడీ, లేదా రేషన్ కార్డు నంబర్ లేదా మొబైల్ నంబర్ ద్వారా చెక్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. మీ వివరాలను నమోదు చేసి చివరగా సబ్మిట్ బట్టన్ నొక్కాలి. అప్పుడు మీ అప్లికేషన్‌కు సంబంధించిన వివరాలు కింద వచ్చేస్తాయి. అక్కడ మీరు ఎల్1 లో ఉన్నారా? లేదా ఎల్2 కేటగిరీలో ఉన్నారా? చెక్ చేసుకోండి.
ఇదీ చదవండి: జియో 336 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్ మాత్రమే కాదు.. మరిన్ని బెనిఫిట్స్..
ఇందిరమ్మ ఇల్లు లిస్ట్2 లో అర్హత సాధించాలంటే..?
దరఖాస్తుదారులు తప్పకుండా శాశ్వత తెలంగాణ వాసి అయి ఉండాలి. వారి కుటుంబం మిడిల్ క్లాస్‌కు చెందినవారై ఉండాలి. అంతేకాదు దరఖాస్తు దారుడు ఇది వరకు ఎప్పుడూ ఏ హౌసింగ్ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకుని ఉండకూడదు. అతనికి సొంత ఇల్లు కూడా ఉండకూడదు.
ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు..
ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, రేషన్ కార్డు, అప్లికేషన్ ఐడీ నంబర్ కలిగి ఉండాలి.
ఇదీ చదవండి: ఉదయం పరగడుపున ఈ ఆకు తింటూ ఉండండి.. ఏ వైద్యుల అవసరమే ఉండదు..
ఇందిరమ్మ ఇల్లకు దరఖాస్తు చేసుకున్నవారికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.5 లక్షల సాయం ఇల్లు కట్టుకోవడానికి అందించనుంది. ఏమైనా సందేహాలు ఉంటే 040- 29390057 ఫోన్ చేయవచ్చు. ఇందిరమ్మ ఇల్లు 2024 డిసెంబర్ 5న ప్రారంభించారు. అధికారిక వెబ్సైట్ www.Indiramma Illu చెక్ చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.