Amla Cucumber Shot Recipe: ఉసిరిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇది తీసుకుంటే ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపడుతుంది. అయితే, ఉసిరి, కీరదోసకాయ కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసా? ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యూలేషన్ కూడా మెరుగవుతుంది. కీరలో ఉండే సిలికా జుట్టు పెరుగుదలకు బూస్టింగ్ ఇస్తుంది.
కీరదోసకాయలో ఎంజైమ్స్ పుష్కలం ఇది హెయిర్ ఫోలికల్స్‌కు మంచి పోషణ అందిస్తుంది. అయితే, ఈరోజు ఉసిరి, కీరదోసకాయం రెండూ కలిపి తీసుకోడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు.. రెండు ఉసిరికాయలు, నల్ల ఉప్పు అరటీస్పూన్, ఒక కప్పు కొబ్బరి నీరు, తేనె ఒక స్పూన్, నిమ్మరసం. వీటన్నింటినీ కలిపి జ్యూస్ తయారు చేసుకోవాలి.
ఉసిరికాయలను కడిగి శుభ్రం చేసి బ్లెండర్లో నీళ్లు పోసి మెత్తని జ్యూస్‌లా తయారు చేసుఓవాలి. ఆ తర్వాత వడకట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఉసిరి బెర్రీలు, కట్ చేసిన కీరదోసకాయ ముక్కలు, కొబ్బరినీరు, ఉప్పు వేసి మరోసారి బ్లెండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్‌లో మీరు నిమ్మరసం, తేనె వేసి కలిపి ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇది మీ జుట్టుకు మాయిశ్చర్ అందిస్తుంది. దీంతో చుండ్రు రాకుండా ఉంటుంది.
ఈ షాట్ వారానికి నాలుగుసార్లు తీసుకోవాలి. పరగడపున తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మీ జుట్టు బలంగా మారుతుంది. హెయిర్ ఫాల్ సమస్య తగ్గిపోతుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ ఉంటుంది. జుట్టు పెరుగుదలకు బూస్టింగ్ ఇస్తుంది. ఈ షాట్ తీసుకునే ముందు డైటీషియన్ సలహా కూడా తీసుకోవచ్చు.