Airtel: ఎయిర్‌టెల్‌ రూ.619 లేదా రూ.649 రెండు ప్లాన్స్‌లో ఎందులో ఎక్కువ బెనిఫిట్స్‌?

Airtel 619 VS 649 Plan: ఎయిర్‌టెల్‌ బడ్జెట్‌ ఫ్రెండ్లీ రీఛార్జీ ప్యాక్‌లను పరిచయం చేస్తోంది. పెరిగిన టెలికాం ధరల సమయంలో లక్షల మంది యూజర్లను కోల్పోయింది ఎయిర్‌టెల్‌. ఈ నేపథ్యంలో కొత్త ఆకర్షణీయమైన ప్లాన్స్‌ పరిచయం చేస్తోంది. ఈరోజు రూ.619 లేదా రూ.649 ఏ ప్లాన్‌లో ఎక్కువ బెనిఫిట్స్‌ పొందుతారు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Feb 20, 2025, 09:41 AM IST
Airtel: ఎయిర్‌టెల్‌ రూ.619 లేదా రూ.649 రెండు ప్లాన్స్‌లో ఎందులో ఎక్కువ బెనిఫిట్స్‌?

Airtel 619 VS 649 Plan: ఎయిర్‌టెల్‌ అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, డేటా సర్వీసులను అందిస్తోంది. ఇవి తక్కువ ధరలోనే పరిచయం చేస్తోంది. ఎయిర్‌టెల్‌లో 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ నుంచి 365 రోజుల వరకు వ్యాలిడిటీ అందించే ప్లాన్స్‌ కూడా ఉన్నాయి. ఇందులో 56 రోజులు, 60 రోజులు వ్యాలిడిటీ అందించే ప్లాన్స్ బోలెడు బెనిఫిట్స్‌ ఉన్నాయి. వీటి ధర కేవలం రూ.619, రూ.649 మాత్రమే. ఈ ప్లాన్స్‌ రెండిటిలో ఏది బెస్ట్‌ తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్‌ రూ.619 ప్లాన్‌..
ఈ ఎయిర్‌టెల్‌ ప్లాన్‌ ధర కేవలం రూ.619 మాత్రమే కానీ, దీని వ్యాలిడిటీ మాత్రం 60 రోజులు. ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, ఫ్రీ నేషనల్‌ రోమింగ్‌, ప్రతిరోజూ 1.5 జీబీ డేటా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కూడా పొందుతారు.. ఇవి కాకుండా ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితం. వీటితోపాటు ఎయిర్‌టెల్‌ కాంప్లిమెంటరీ ప్లాన్స్‌ కూడా యాక్సెస్‌ పొందుతారు.

ఎయిర్‌టెల్‌ రూ.649 ప్లాన్‌..
ఎయిర్‌టెల్‌ రూ.649 ప్లాన్‌ వ్యాలిడిటీ 56 రోజులు పొందుతారు. ఈ ఎయిర్‌టెల్‌ ప్లాన్‌లోకూడా అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, ఉచిత రోమింగతోపాటు ప్రతిరోజూ 2 జీబీ హై స్పీడ్‌ డేటా పొందుతారు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా పూర్తిగా ఉచితం. మీ ఫోన్‌ 5జీ ఫోన్‌ అయితే మరిన్ని బెనిఫిట్స్ పొందుతారు.

ఈ ప్లాన్స్‌ రెండిటి ధరల మధ్య తక్కువ వ్యత్యాసం మాత్రమే ఉంది. యూజర్లు తమ అవసరాల నిమిత్తం ప్లాన్‌ ఎంచుకోవాలి. దేశవ్యాప్తంగా 38 కోట్ల మంది యూజర్లను కలిగ ఉంది ఎయిర్‌టెల్‌ .

ఇటీవలె ట్రయ్‌ (TRAI) టెలికాం కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా తక్కువ ధరలో వాయిస్‌ ఓన్లీ ప్లాన్స్‌  అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. ఈనేపథ్యంలో టెలికాం కంపెనీలు వాయిస్‌ ప్లాన్స్‌ పరిచయం చేశాయి. దీంతో ఫీచర్‌ ఫోన్లు ఉపయోగించే వారికి ఇది బెస్ట్‌. వీరు డేటా వినియోగించరు కాబట్టి అనవసరంగా డేటా ప్యాక్‌ కొనుగోలు చేసే బదులుగా కేవలం అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ ప్యాక్‌ కొనుగోలు చేయవచ్చు.

ఇదీ చదవండి:  సర్కారీ నౌకరీ మీ కల? రూ.180000 జీతం.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి.  

రూ.469 ప్లాన్‌ ఇందులో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ 3 నెలలపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. మొబైల్‌ డేటా అవసరం లేనివారికి ఇది బెస్ట్‌ ప్లాన్‌. కేవలం కాలింగ్‌ మాత్రమే పొందుతారు. అయితే, ఈ ప్లాన్‌ 900 ఫ్రీ ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందుతారు. దీంతోపాటు ఫ్రీ హలోట్యూన్‌ యాక్సెస్‌ కూడా పొందుతారు.

ఇది కాకుండా ఎయిర్‌టెల్‌ జియో హాట్‌స్టార్‌ సబ్‌స్క్రీప్షన్‌ ప్లాన్‌ కూడా పరిచయం చేసింది. ఇది బడ్జెట్‌ ఫ్రెండ్లీలోనే అందుబాటులో ఉంది. ఇందులో మీు కొత్త సినిమాలు ఎక్కువ ఖర్చు లేకుండానే వీక్షించవచ్చు. దీంతో కాలింగ్‌, ఎంటర్‌టైన్మెంట్‌ కూడా పొందుతారు. 

ఇదీ చదవండి: రైతులకు కేంద్ర ప్రభుత్వం బిగ్‌ షాక్‌.. ఈసారి వారికి మాత్రమే రూ. 2000 జమా, ఎందుకంటే?  

ఇక ప్రభుత్వ రంగ కంపెనీ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యారిఫ్‌లను పెంచలేదు. ఈ టెలికాం కంపెనీ కూడా బడ్జెట్‌లోనే రీఛార్జీ ప్యాక్‌లను పరిచయం చేస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ రెండు సేవలను అందిస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News