New CM: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై ఇంకా వీడని పీఠముడి.. పది రోజులు దాటినా సీఎం ఎవరనే దానిపై క్లారిటీ..

Delhi New CM: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 5 జరిగాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెలుబడ్డాయి. ఫలితాలు వెలుబడి 10 రోజులు దాటుతున్న సీఎం పీఠం దక్కేది ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. దాదాపు 27 యేళ్ల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి సింహాసనంపై బీజేపీ కి చెందిన వాళ్లు కూర్చోనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 19, 2025, 04:55 AM IST
 New CM: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై ఇంకా వీడని పీఠముడి.. పది రోజులు దాటినా సీఎం ఎవరనే దానిపై క్లారిటీ..

Delhi New CM: ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలుబడి దాదాపు 10 రోజులు దాటుతున్న ఎవరు సీఎం అవుతారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. మధ్యలో ప్రధాన మంత్రి ఫ్రాన్స్, అమెరికా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంపిక ఆలస్యమవుతూ వచ్చింది. ఈ నేపత్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఓ మహిళకు అప్పగించాలనే యోచనలో ఢిల్లీలోని బీజేపీ పెద్దల యోచనగా కనిపిస్తోంది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది. ఈ రోజు బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత రానుంది. మరోవైపు.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ లీలా మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే నాయకులైన నితీష్ కుమార్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఏక్ నాథ్ షిండే, చిరాగ్ పాశ్వాన్ వంటి నేతలతో పాటు  పలువురు కేంద్ర మంత్రులు, భారత్‌లోని విదేశీ దౌత్య వేత్తలు హాజరు కానున్నారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

రేఖ గుప్తా..షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. గతంలో జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. అలాగే బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా ఉండటంతో పాటు కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పని చేసిన అనుభవం ఉంది.

పార్టీ పెద్దలతో ఎక్కువ సంబంధాలు ఉండడంతో ఈమెను ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు ఎవరు లేరు. అందుకోసమే ఢిల్లీ సీఎం పీఠంపై మహిళను కూర్చోబెట్టాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో పార్టీ కోసం కష్టపడిన రేఖ గుప్తాను అధిష్టానం పెద్దలు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లేకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అదే ఫార్ములాను ఢిల్లీలో కూడా అమలు చేయడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖ గుప్తాకు అవకాశం దక్కునున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News