Bad Combination With Papaya: బొప్పాయి తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెంచుతుంది. ఇది అన్ని వయసు వారికి ఆరోగ్యకరం. ఈ పండు తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలుగుతుంది. అయితే బొప్పాయి కొన్ని రకాల ఆహారాలతో తీసుకోకపోవడమే మేలు.. అలాంటి ఆహారాల జాబితా తెలుసుకుందాం
సిట్రస్ పండ్లు..
బొప్పాయిని పొరపాటున కూడా సీట్రస్ పండ్లతో కలిపి సలాడ్ రూపంలో తీసుకోవద్దు. ముఖ్యంగా ఆరెంజ్, గ్రేప్స్ తో పాటు బొప్పాయి తినకూడదు.. ఇలా చేయడం వల్ల కడుపులో యాసిడిటీ, గుండె మంట సమస్య వస్తుంది. ఈ రెండిటినీ కలపడం వల్ల ఈ ఆరోగ్య సమస్యకు దారితీస్తుంది.
ప్రోటీన్ ఫుడ్..
బొప్పాయిలో ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి ప్రోటీన్స్ ను విడగొట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఎక్కువ శాతం ప్రోటీన్ కలిగి ఉంటుంది. అయితే ఈ బొప్పాయితో కలిపి హై ప్రోటీన్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కడుపులో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మాంసం, చేపలు, టోఫు వంటివి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. బొప్పాయితో పొరపాటున ఈ ఆహారాలు తినకూడదు.
బొప్పాయితో మిల్క్ షేక్ లేదా స్మూథీలతో పాటు తీసుకోకూడదు. ముఖ్యంగా పాలు, పాలతో తయారు చేసిన ఇతర పదార్థాలు బొప్పాయితో కలిపి తీసుకోకూడదు. ఇందులో పప్పైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీంతో జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. గ్యాస్, కడుపులో నొప్పి సమస్య అనుభవిస్తారు.. అంతే కాదు బొప్పాయిని కొన్ని రకాల పులియపెట్టిన ఆహారలతో తీసుకోకూడదు.. ముఖ్యంగా కిమ్చీ వంటి పదార్థాలతో తినకూడదు. ఇది కూడా జీర్ణ సమస్యలకు గ్యాస్‌కు దారితీస్తుంది.
ఇదీ చదవండి: విద్యార్థులకు శుభవార్త.. నేడు ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..!
బొప్పాయి పండును అధికంగా మసాలా ఉండే ఆహారాలతో కూడా తినకూడదు. ఆరోగ్యానికి నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కడుపులో గ్యాస్, అజీర్తికి దారితీస్తుంది. రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ లేదా గుండె మంట సమస్య వస్తుంది. బొప్పాయిలో కూలింగ్ గుణాలు కలిగి ఉంటుంది. దీన్ని అధిక మసాలాలు ఉండే పదార్థాలతో తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
ఇదీ చదవండి: తెలంగాణ రైతు భరోసా అప్లికేషన్ స్టేటస్ ఇలా సింపుల్‌గా చెక్ చేసుకోండి..
ఇది మాత్రమే కాకుండా పచ్చి గుడ్లతో కూడా బొప్పాయి తినకూడదు. ఇంకా గంజి, బంగాళదుంపలు వంటి ఆహారాలతో బొప్పాయి తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతారు.. మాంసం, క్రీమీ సాస్‌లతో కూడా తీసుకోవద్దు. వీటితో కలిపి బొప్పాయి తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు వస్తాయి. బొప్పాయి అతిగా తినకూడదు. ముఖ్యంగా పెద్దలు బొప్పాయి మీడియం సైజ్ లో ఉన్నది తీసుకోవాలి. అతిగా బొప్పాయి తీసుకోవడం వల్ల మనకు కడుపు సమస్యలకు దారితీస్తుంది హైడ్రేషన్ తగ్గుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.