వరంగల్ రూరల్: లాక్ డౌన్ సమయంలో మద్యం విక్రయాలు లేకపోవడంతో.. మద్యాన్ని బ్లాక్‌లో అమ్మి సొమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతో పోలీసు వేషం వేసిన ఇద్దరు కేడీగాళ్లు ఆఖరికి ఆ పోలీసులకే చిక్కి కటాకటాలు లెక్కిస్తున్నారు. సోమవారం అర్దరాత్రి కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ కరీమాబాద్‌కు చెందిన రాజుకుమార్, రవిలకు నర్సంపేటలో శ్రీనివాస వైన్స్ పేరిట మద్యం దుకాణం ఉంది. లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడటంతో.. ఈ సమయంలోనే మద్యాన్ని బ్లాక్మార్కెట్లో విక్రయించి అడ్డదారిలో డబ్బు సంపాదించాలని స్కెచ్ వేసుకున్నారు.
Also read : Flash: ఒక్క రాష్ట్రంలోనే 2,455 కరోనా పాజిటివ్ కేసులు, 160 మంది మృతి
ముందుగా అనుకున్న పథకం ప్రకారమే తమ కారుకు పోలిస్ స్టిక్కర్ అంటించి, కారు ముందుభాగంలో బయటికి కనిపించేటట్టుగా పోలిస్ టోపి పెట్టుకుని నర్సంపేటకు బయల్దేరారు. మార్గం మధ్యలో ఎదురైన అన్ని చెక్ పోస్టుల వద్ద పోలిస్ వాహనం అని చెప్పుకుంటూ అనుకున్నట్టుగానే నర్సంపేట వరకు చేరుకున్నారు. నర్సంపేటలో అర్దరాత్రి సమయంలో ఎవరు లేనిది చూసి శ్రీనివాస వైన్స్ షాపు తాళం తీసి అందులో నుండి మద్యం బాటిల్స్ కారులో పెడుతుండగా అప్పుడే పెట్రోలింగ్ నిర్వహిస్తూ అటువైపుగా వచ్చిన పోలిసుల కంటపడ్డారు. అక్రమంగా మద్యం తరలించాలని చూసిన రాజ్ కుమార్, రవిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కారుతో పాటు అందులో ఉన్న మద్యాన్ని స్వాధీనం చేసుకుని నర్సంపేట పోలిస్ స్టేషన్‌కు తరలించారు. నిందితులు ఉపయోగించిన కారుకు నెంబర్ ప్లేటు కూడా లేకపోవడం గమనార్హం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..