School Holidays: తెలంగాణ..ఈనెల 15న సెలవా.. ఎందుకంటే..?

Telangana February 15 holiday: బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15 కావడంతో ఆరోజు సెలవు ప్రకటించడానికి ఆస్కారం ఉన్నట్లు సమాచారం. ఆయన సేవలను గుర్తించి ఫిబ్రవరి 15 అనగా గురువారం సెలవు ప్రకటించాలని.. కోరుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Feb 13, 2025, 11:36 AM IST
School Holidays: తెలంగాణ..ఈనెల 15న సెలవా.. ఎందుకంటే..?

Telangana government holiday: ఈనెల 15వ తేదీన బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అధికారికంగా పలు రకాల సేవా కార్యక్రమాలు, జయంతి వేడుకలను సైతం నిర్వహించబోతున్నారు. అలాగే తెలంగాణలో కూడా ఆరోజు ఈ జయంతిని చాలా గ్రాండ్గా చేయాలని గిరిజన నాయకులు సైతం నిన్నటి రోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది.. 

ముఖ్యంగా ఆరోజున పబ్లిక్ హాలిడే ఇవ్వాలని కూడా కొంతమంది నేతలతో పాటు ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారట. గత ఏడాది కూడా ఫిబ్రవరి 15వ తేదీన సెలవు ఇచ్చారని ఈసారి కూడా వీటిని అమలు చేయాలంటూ చాలా వినతి పత్రాలు కూడా వచ్చాయట. అయితే ఈ నేపథ్యంలోనే సెలవు పైన సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు.

కానీ సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొనాలి అంటే సీతక్కతో పాటుగా గిరిజన నాయకులు నిన్నటి రోజున వెళ్లి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. 
అలాగే బిజెపి ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునాధ రావు, డీకే అరుణ తదితరులు సైతం తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడి ఈనెల 15వ తేదీన సేవాలాల్ జయంతిని సైతం అధికారికంగా జరుపుకునేందుకు సెలవు ఇవ్వాలి అంటూ కేంద్రమంత్రికి కూడా విజ్ఞప్తి చేశారట. 

దేశవ్యాప్తంగా 16 కోట్ల మంది గిరిజనులకు సైతం సేవాలాల్ మార్గదర్శిగా నిలిచారంటూ  పలువురు నేతలు తెలియజేస్తున్నారు. మరి వీటి పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఈనెల 15న అధికారికంగా సెలవు మంజూరు చేస్తారో చూడాలి.

ఇక ప్రస్తుతం ఈ విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారని, పూర్తి పరిశీలన తర్వాత నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం ఒకవేళ ఫిబ్రవరి 15వ తేదీన సెలవు ప్రకటిస్తే ఇక అదే సెలవు దినాలను ప్రతి ఏడాది ప్రకటించడానికి మార్గం అవుతుందని కూడా భావిస్తున్నట్లు సమాచారం. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.

Read more: Rashmika Mandanna: మరో రెండు రోజుల్లో చావా విడుదల .. రష్మికను ఇష్టమోచ్చినట్లు తిట్టిన స్టార్ హీరో..!.. మ్యాటర్ ఏంటంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News