Gold Price Increase: దిన దినానికి బంగారం ధర రెక్కలు తెంచుకుని ఆకాశం వైపు పరిగెడుతోంది. బంగారం ధర రోజురోజుకు పెరుగుకుంటూ ఇప్పటికే రూ.90 వేలకు చేరుకుంది. త్వరలో రూ.లక్షకు తాకే అవకాశం కూడా ఉంది. ఇలా బంగారం ధర పెరిగిపోతుంటే ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దీర్ఘకాల లాభాల కోసం బంగారంపై పెట్టుబడి పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైంది. ఇప్పుడు బంగారంపై పెట్టుబడి పెడితే భవిష్యత్‌లో లాభం వస్తుందా.. లేదా అని చర్చ జరుగుతోంది. మరి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Also Read: Ram Charan: అల్లు వర్సెస్ కొణిదెల... అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన రామ్‌చరణ్
కొన్ని రోజుల్లోనే బంగారం ధర రూ.90 వేలు దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డొనల్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. స్టాక్ మార్కెట్‌లలో కూడా గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో బంగారం ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బంగారం ధరలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇక రూపాయి (డాలర్‌తో పోలిస్తే) చాలా బలహీనపడుతోంది.
Also Read: WhatsApp Governance: ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు బంద్? ఇకపై అన్నీ వాట్సప్‌లోనే!
ఈ సమయంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లుతున్నారు. బంగారంపై పెట్టుబడి సురక్షితమని.. భవిష్యత్‌లో భారీ లాభాలు ఉంటాయని భావిస్తూ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. స్టాక్ మార్కెట్‌లో వచ్చే నష్టాల నుంచి తప్పించుకోవడానికి.. భర్తీ చేసుకోవడానికి బంగారంపై పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో తీవ్ర అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలోబంగారంపై పెట్టుబడి సురక్షితం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
తమ పెట్టుబడి సురక్షితంగా ఉండాలని బంగారంపై పెట్టుబడి పెడితే బంగారానికి డిమాండ్ పెరిగిపోతోందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. డిమాండ్ పెరగడం వల్ల పసిడి ధరలు కూడా భారీగా పెరుగుతాయని భవిష్యత్‌లో మంచి లాభాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని యుద్ధాల భయంతో చాలామంది బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించి పెట్టుబడి చేస్తున్నారు. రూపాయి పతనం అయినప్పుడు ప్రజలు చూపు డాలర్ వైపు చూస్తారు. అయితే ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ ప్రభావంతో డాలర్‌పై పెట్టుబడి పెట్టలేమని ఆర్థిక నిపుణులు సమాధానం ఇస్తున్నారు. ఈ సమయంలో బంగారంపై పెట్టుబడి చాలా ఉత్తమం.
ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరుగుతుండగా.. ఇలాగే పెరుగుతాయని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ ఆలోచన ఉంటే బంగారంపై ఒకేసారి పెట్టుబడి పెట్టకుండా ధర తగ్గిన ప్రతిసారీ తక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలికంగా బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారు గోల్డ్ ఈటీఎఫ్, సావరిన్ గోల్డ్ ఫండ్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరంగా చెబుతున్నారు. బంగారం కొనేవారు బిస్కెట్స్ రూపంలో కొనుగోలు చేస్తే మరింత మేలు ఉంటుందని పేర్కొంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter