Sadha marriage: హీరోయిన్ సదా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఈ హీరోయిన్.. దాదాపు నాలుగు పదుల వయసు దాటుతోంది. ఈ క్రమంలో ఈమె త్వరలో పెళ్లి చేసుకొనుండి అనే రాష్ట్రాలు వినిపిస్తున్నాయి. అంతే కాదు వరుడు ఎవరని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఈ క్రమంగా ఈ హీరోయిన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రముఖ హీరోయిన్ సదా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నితిన్ హీరోగా వచ్చిన జయం సినిమాతో తొలిసారి తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా వెళ్లవయ్యా వెళ్ళు అనే డైలాగ్ తో.. మరింత పాపులారిటీ అయిపోయింది సదా.
ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా ఏళ్లవుతున్నా.. ఇప్పటికీ తన అందంలో ఏ మాత్రం మార్పు రాలేదు అనడంలో సందేహం లేదు. అంతలా తన అద్భుతమైన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు రియాల్టీ షోలలో, డాన్స్ షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ కెరియర్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుత నీ హీరోయిన్ దాదాపు నాలుగు పదుల వయసుకు దగ్గరగా ఉంది.
ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. వివాహం అనే మాట ఎత్తకపోవడం పై పలువురు పలు కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య ఈ హీరోయిన్ కి త్వరలోనే పెళ్లి అంటూ వార్తలు రాసాగాయి. అంతేకాదు ఒక బిజినెస్ మాన్ ని చేసుకోనంది అనే రూమర్స్ కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా పెళ్లి పై మరొకసారి స్పందించింది హీరోయిన్ సదా.
సదా మాట్లాడుతూ.. పెళ్ళికి నేను వ్యతిరేకిని కాదు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత కచ్చితంగా పెళ్లి చేసుకోవాలి లేకపోతే సొసైటీ ఊరుకోదు అనే మాటలకు నేను పూర్తి వ్యతిరేకిని. ఎవరికైతే మనసు హ్యాపీగా ఉండి వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతారో అప్పుడే వివాహానికి సిద్ధం అవ్వాలి. అంతేతప్ప ఎవరి కోసమో పెళ్లి చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకోకూడదనేది నేను నమ్ముతాను . అలాగే వైవాహిక బంధంలో ఏదైనా గొడవలు వస్తే విడిపోవడం కూడా కరెక్టే అంటూ సదా తెలిపింది.
ఇకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ పై తనకు నమ్మకం లేదని తెలిపింది. ఎందుకంటే తన తల్లిదండ్రులు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారని, ఇక తాను కూడా మనసుకు నచ్చిన వాళ్ళు దొరికి వాళ్లతో తన జీవితం బాగుంటుంది అనిపిస్తే, వివాహానికి సిద్ధమవుతానని, అంతేకానీ ఎవరో ఒక తెలియని వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోలేను అంటూ కూడా స్పష్టం చేసింది సదా.
ఇక అలాగే తాను మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను ఈ లైఫ్ తో చాలా సంతోషంగా ఉన్నాను. ఇక ఎవరో కొత్తగా నా జీవితంలోకి వచ్చి ఇంకా ఏదో ఆనందాన్ని నాకు ఇస్తారు అంటే అది నాకు అవసరం లేదు. అంటూ కూడా సదా తెలిపింది. ప్రస్తుతం సదా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.