Gaj Kesari Yog: 55 ఏళ్ల తర్వాత అరుదైన గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి విశేష రాజయోగంతో పాటు, సొంతింటి కల సాకారం..!.. మీరున్నారా..?

Maghi Purnima effect: మాఘీ పౌర్ణమి వేళ అరుదైన గజకేసరి యోగం ఏర్పడబోతుందని పండితులు చెబుతున్నారు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. కొన్ని రాశులకు ఆకస్మిక ధనలాభం కల్గుతుందని పండితులు సూచిస్తున్నారు.
 

1 /6

ప్రస్తుతం దేశంలో కుంభమేళ ఉత్సవం జరుగుతుంది. మరోవైపు మాఘీ పౌర్ణమి రేపు ఏర్పడబోతుంది. ఈ సమయంలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు విశేషమైన పుణ్యం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు. దీని వల్ల జీవితంలో ఏర్పడిన సమస్యలన్ని దూరమౌతాయని చెబుతున్నారు.

2 /6

అయితే.. ఈ సారి మాఘీపౌర్ణమి వేళ అత్యంత అరుదైన గజకేసరి యోగం ఏర్పడబోతుంది. ఇది దాదాపు.. 55 ఏళ్ల తర్వాత ఏర్పడుతుంది. దీంతో దీని ప్రభావం అనేది ద్వాదశ రాశులపై ఉండబోతుంది. దీని వల్ల కొన్ని రాశులకు విశేషమైన మంచి ఫలితాలు కల్గబోతున్నాయి.

3 /6

కుంభం రాశి.. ఈ రాశి వారికి ఈ యోగం వల్ల జీవితంలో ఇప్పటి వరకు చూడని ధనంను మీ సొంతం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మోసం చేసిన వారు మరల మీ ముందుకు వచ్చి తప్పు ఒప్పుకుంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది.  

4 /6

కన్య రాశి..ఈ రాశి వారు చేపట్టిన పనులన్ని ఆటంకంలేకుండా పూర్తవుతాయి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమౌతాయి. విదేశీయానానికి అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. మీ భార్యవైపు ఆస్తులు మీ సొంతమౌతాయి..

5 /6

కర్కాటకం.. ఈ రాశివారు రాజకీయాల్లో రాణిస్తారు. మీ వల్ల లాభాలు పొందిన వారు మీకు సహాయం చేస్తారు. విశేషమైన రాజయోగంతో పాటు, ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా మీరు సొంతం చేసుకుంటారు. వ్యాపారాలలో రాణిస్తారు.

6 /6

అదే విధంగా ప్రస్తుతం కుంభమేళ నేపథ్యంలో మాఘీపౌర్ణమి రోజున పుణ్యస్నానాలు ఆచరించాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ముఖ్యంగా నదులు, సరస్సులలో శ్రీమహా విష్ణువు నివాసం ఉంటారని కూడా చెబుతున్నారు. అందుకే ఈరోజున తప్పకుండా షాహిస్నానం ఆచరించాలని పండితులు చెబుతున్నారు.