Triumph Speed T4 Price: ట్రయంఫ్‌ Speed T4 బైక్‌పై ఊహించని డిస్కౌంట్‌.. తక్కువ ధరకే మీ సొంతం..


Triumph Speed T4 Price Cut: ట్రయంఫ్ స్పీడ్ T4 మోటర్‌సైకిల్‌పై ఊహించని డిస్కౌంట్‌ ఆఫర్ లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఎన్నో రకాల ప్రత్యేకమైన ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Triumph Speed T4 Price Cut: ఎప్పటి నుంచో మంచి స్పోర్ట్‌బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా స్పెషల్ డిస్కౌంట్‌తో.. ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రముఖ స్పోర్ట్‌ బైక్‌ తయారీ కంపెనీ ట్రయంఫ్‌ గతంలో విడుదల చేసిన ట్రయంఫ్ స్పీడ్ T4 మోటర్‌సైకిల్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అయితే ఈ స్పోర్ట్‌బైక్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

1 /5

ట్రయంఫ్ స్పీడ్ T4 మోటర్‌సైకిల్ ధర రూ. 2.17 లక్షలు కాగా.. ఈ మోటర్‌సైకిల్‌ ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. అయితే ఇప్పుడే దీనిని కొనుగోలు చేసేవారికి రూ.18,000 తగ్గింపు లభిస్తుంది.  దీంతో ఈ ఆఫర్స్‌ పోనూ రూ.1,99,000కే పొందవచ్చు.  

2 /5

ఈ ట్రయంఫ్ స్పీడ్ T4 మోటర్‌సైకిల్ వివరాల్లోకి వెళితే.. ఇది అద్భుతమైన డిజైన్‌తో విడుదల కానుంది. అలాగే ప్రీమియం అల్లాయ్ వీల్స్, రౌండ్ హెడ్‌లైట్‌ను కలిగి ఉంటుంది. అలాగే సింగిల్-పీస్ సీటును కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు అద్భుతమైన ఫాంటమ్ బ్లాక్, కాక్‌టెయిల్ రెడ్ వైన్ ఫీచర్స్‌తో లభిస్తోంది.  

3 /5

ఈ శక్తివంతమైన మోటర్‌సైకిల్ మూడు కలర్‌ షేడ్స్‌లో అందుబాటులోకి రానుంది. అలాగే దీని హ్యాండిల్‌బార్‌ అన్ని మోటర్‌సైకిల్స్‌తో పోలిస్తే కాస్త ఎత్తు ఉండనుంది. దీని ఎత్తు 827mm ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన రైడ్-బై-వైర్ థ్రోటిల్‌తో పాటు స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి.

4 /5

అలాగే ఈ సూపర్‌బైక్‌లో డ్యూయల్-ఛానల్ ABSను కూడా అందిస్తోంది. దీంతో పాటు సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్ అద్భుతంగా ఉండబోతోంది. అలాగే రెండు చక్రాలకు ప్రత్యేకమైన డిస్క్ బ్రేకింగ్‌ సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. 

5 /5

ప్రస్తుతం ట్రయంఫ్ స్పీడ్ T4 మోటర్‌సైకిల్ మార్కెట్‌లో గతంలో విడుదలైన కొత్త మోడల్‌ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350తో పోటీ పడుతోంది. అయితే రెండు సరైన ధరల్లో ఉండడం వల్ల యువత ఎక్కువగా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.