Takita Tadimi Tandana:ఏ చిత్రానికయినా కంటెంటే అత్యంత కీలకం అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తాజాగా తకిట తదిమి తందాన ఫస్ట్ లుక్ వేడుకలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్కువ బడ్జెట్ చిత్రమా? కొత్త యాక్టర్స్ నటించారనే అనే విషయాన్ని పట్టించుకోకుండా మంచి కంటెంట్‌తో తెరకెక్కే చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ తప్పక ఉంటుందన్నారు. ఫీల్‌గుడ్‌గా నిలిచే చిత్రాలు మంచి సక్సెస్ లు అందుకొంటున్నాయని తెలంగాణా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
సినిమాలో కథ బాగుంటే..ఆ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంతేకాదు ఆ చిత్రాలు ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని పంచుతున్నాయన్నారు మంత్రి. "తకిట తదిమి తందాన" చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.
‘మర్డర్’ చిత్రంలో కథానాయకుడిగా యాక్ట్ చేసిన ఘన ఆదిత్య, తెలుగు అమ్మాయి ప్రియ జంటగా నూతన దర్శకుడు రాజ్ లోహిత్ డైరెక్షన్ లో ఎల్లో మాంగో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానరుపై చందన్ కుమార్ కొప్పుల ఈ సినిమాను నిర్మించారు "తకిట తదిమి తందాన". ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ, సినీటేరియా మీడియా వర్క్స్ అధినేత వెంకట్ బులెమోని, సినిమా డైరెక్టర్ రాజ్ లోహిత్, నిర్మాత చందన్ కుమార్ కొప్పులతో బాటు, నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఈ నెల 27వ తేదీన తకిట తదిమి తందాన" చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్ లో రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత చందన్ కుమార్ తెలిపారు. ఈ చిత్రం సినెటేరియా మీడియా వర్క్స్ ఆధ్వర్యంలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.