Telangana Rythu Bharosa: 17.03 లక్షల రైతుల అకౌంట్లలో నిధులు జమ చేసినట్లు తెలిపారు వ్యవసాయశాఖ మత్రి తుమ్మల తెలిపారు. ప్రారంభోత్సవం నాడు విడుదల చేసిన నిధులతో కలుపుకొని ఈ రోజు వరకు మొత్తం 1,126.54 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే రైతుబంధుకు రూ. 7వేల 625 కోట్లు, రుణమాఫీకి రూ. 20వేల 616.89 కోట్లు, రైతు భీమాకు రూ. 3వేల కోట్లు కేటాయించామన్నారు. పంటలకు గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఒక ఎకరం ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు పూర్తి కావడంతో..మరో రెండు రోజుల్లో రెండు, మూడు ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు వేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
తెలంగాణ అధికారంలో వచ్చిన యేడాది తర్వాత రైతులకు అకౌంట్లో డబ్బు జమ చేసింది రేవంత్ సర్కారు. ముందుగా ఒక ఎకరం ఉన్న రైతుల అకౌంట్లో డబ్బులు వేసిన రేవంత్ సర్కార్.. రెండో విడతలో 2 ఎకరాల పొలం ఉన్న రైతులకు అకౌంట్లలో పైసలు జమ చేయనున్నారు. ఆపై మూడు ఎకరాలు .. నాలుగు ఎకరాలతో పాటు విడతల వారీగా పైసలు జమ చేయనున్నారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.