Rahul Dravid: రాహుల్‌ ద్రవిడ్‌ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ఘోరం

Rahul Dravid Escaped From Major Accident At Bengaluru: భారత జట్టు ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కారు ప్రమాదానికి గురయ్యింది. తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏం జరిగింది? ఎక్కడ జరిగిందనే వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 5, 2025, 12:49 AM IST
Rahul Dravid: రాహుల్‌ ద్రవిడ్‌ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ఘోరం

Rahul Dravid Car Accident: భారత క్రికెట్‌లో అద్భుతంగా రాణించి ప్రస్తుతం భారత పురుషుల క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రోడ్డుపై వెళ్తుండగా కారు ప్రమాదానికి గురయ్యింది. అయితే చిన్న ప్రమాదమే సంభవించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తన కారును ఢీకొట్టిన ఆటో డ్రైవర్‌తో ద్రవిడ్‌ వాగ్వాదానికి దిగడంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైలర్‌గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Its Complicated Trailer: 'వాలంటెన్స్‌ డే'కు ముగ్గురు లవర్లతో 'ఇట్స్‌ కాంప్లికేటెడ్‌'గా వస్తున్న 'డీజే టిల్లు'

భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌, ప్రస్తుత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ బెంగళూరులో పర్యటిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో నగరంలో తిరుగుతుండగా అకస్మాత్తుగా వెనుకాల నుంచి వచ్చిన ట్రాలీ ఆటో కారును ఢీకొట్టింది. అనూహ్య సంఘటనతో ఉలిక్కిపడిన ద్రవిడ్‌ వెంటనే కారును పక్కకు తీసి ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే ఆటో డ్రైవర్‌, ద్రవిడ్‌ ఇద్దరూ కన్నడలో మాట్లాడుతున్నారు. తన కారు స్వల్పంగా దెబ్బతినడంతో ఆ విషయమై డ్రైవర్‌పై ద్రవిడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొన్ని నిమిషాలపాటు జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Also Read: India Vs England 5th T20 Highlights: ఆఖరి పంచ్ కూడా మనదే.. ఐదో టీ20 భారత్ సూపర్ విక్టరీ

ఈ సంఘటన బెంగళూరులోని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్కిల్‌- హైగ్రౌండ్స్‌ మార్గంలో సంభవించింది. ఈ ప్రమాదం ఆటో డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడం ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ద్రవిడ్‌, ఆటో డ్రైవర్‌ ఘటనా స్థలంలోనే వివాదాన్ని పరిష్కరించుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే తన కారు దెబ్బతినడంతో ఆటో నడిపిన డ్రైవర్‌ వివరాలు ద్రవిడ్‌ తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ సంఘటనపై స్పందించడం లేదు. వారిద్దరూ మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుని ఉంటారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఆటో డ్రైవర్‌తో ద్రవిడ్‌ గొడవ పడుతున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఎస్‌యూవీ కారును కచ్చితంగా కొన్ని రోజులు దూరం పెట్టే అవకాశం ఉంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News