PM Modi: కుంభ మేళాకు ప్రధాని నరేంద్ర మోదీ.. భీష్మాష్టమి నేపథ్యంలో పుణ్యస్నానం..

Maha Kumbh mela 2025: ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళకు వెళ్లనున్నారు. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన జారీ చేశారు. దీంతో ప్రయాగ్ రాజ్ లో అధికారులు హైఅలర్ట్ అయ్యారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 4, 2025, 09:40 PM IST
  • త్రివేణి సంగమానికి మోదీ..
  • రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు..
PM Modi: కుంభ మేళాకు ప్రధాని నరేంద్ర మోదీ.. భీష్మాష్టమి నేపథ్యంలో పుణ్యస్నానం..

PM Narendra modi to visit prayag raj kumbh mela: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు భారీగా తరలిస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన మహాకుంభమేళ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా.. 35 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా..జనవరి 13న ప్రారంభమైన కుంభమేళ ఫిబ్రవరి 26 వరకు కొనసాగతుంది.

ఇప్పటికి భక్తుల కోసం యూపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. మౌనీ అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట తర్వాత యోగి ప్రభుత్వం మరింత అలర్ట్ అయ్యింది. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరో రెండు షాహీ రోజులు మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి మఘా పౌర్ణమి 12, మహా శివరాత్రి ఫిబ్రవరి 26 లతో ఈ కుంభమేళ ముగియనుంది.  

ఈరోజు భూటాన్ రాజు సైతం కుంభమేళకు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించాడు. అంతేకాకుండా.. గంగాహరతిలో సైతం పాల్గొన్నాడు. రేపు అంటే.. (ఫిబ్రవరి5న) బుధవారం రోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాగ్ రాజ్ కు వెళ్లనున్నారు. కుంభమేళ నేపథ్యంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అదే విధంగా రేపు భీష్మాష్టమి సైతం కావడంతో భక్తులు భారీగా ప్రయాగ్ రాజ్ కు తరలివస్తున్నారు.

Read more: Kumbh Mela stampede: 30 మంది చనిపోవడం పెద్ద విషయం కాదు.. తొక్కిసలాటపై షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ..

ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో ఎక్కడ కూడా సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా యోగి సర్కారు కీలక చర్యలు తీసుకుంటుంది. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ 11 గంటల ప్రాంతంలో త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తారని సమాచారం. ఈక్రమంలో ఇప్పటికే ప్రయాగ్ రాజ్ కుంభమేళ ప్రాంతంలో ప్రత్యేకంగా బలగాలు రంగంలోకి దిగాయి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటలు జరక్కుండా పటిష్టమైన బందోబస్తు సైతం చేపట్టాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News