Tollywood Heroes Educational Qualifications: చిరు, బాలయ్య, పవన్ సహా టాలీవుడ్ సీనియర్ హీరోస్‌ ఏం చదవుకున్నారో తెలుసా..

Tollywood Heroes Educational Qualifications: తెలుగులో సీనియర్ స్టార్స్ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు.  మన యంగ్ హీరోల్లో చాలా మంది ఫారెన్ లో చదువుకున్నారు. ఇక సీనియర్ హీరోల్లో వెంకటేష్, నాగార్జున వంటి వారు కూడా విదేశాల్లో చదువుకొని వచ్చిన ఇక్కడ కథానాయకులుగా సెటిల్ అయ్యారు. ఇక హీరోల చదవు విషయానికొస్తే..

1 /11

మన హీరోలు ఏం చదువుకున్నారనేది చాలా మంది తెలుసుకోవాలని ఉంటుంది. సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు ఏం చదువుకున్నారనేది మీరు ఓ లుక్కేయండి..

2 /11

చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవి తెలుగులో  స్వయంకృషితో  మెగాస్టార్ గా ఎదిగారు. చిరు కామర్స్ లో  డిగ్రీ చేసారు. అది కూడా YN కాలేజీ, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో చదువుకున్నారు.

3 /11

బాలకృష్ణ.. నందమూరి బాలకృష్ణ.. భాగ్య నగరంలో నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేస్తూనే హీరోగా కెరీర్ కొనసాగించారు. తాజాగా బాలయ్యను కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.  

4 /11

నాగార్జున (Nagarjuna Akkineni) ఏఎన్నార్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగార్జున అమెరికాలోని ఈస్టర్న్, మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి హీరో అయ్యారు.    

5 /11

వెంకటేష్.. విక్టరీ వెంకటేష్ అమెరికాలో MBA పూర్తి చేసి ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. మోంటేరే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, అమెరికాలో చదువుకున్నారు.

6 /11

పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. అంజనా ప్రొడక్షన్స్ లో సహా నిర్మాతగా కెరీర్ ప్రారంభించి.. ఆపై కథానాయకుడిగా.. జనసేన అధినేతగా రాజకీయాల్లో డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు.

7 /11

ప్రభాస్.. రెబల్ స్టార్ ప్రభాస్..బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. ‘ఈశ్వర్’ సినిమాతో పరిచయమైన రెబల్ స్టార్.. బీటెక్ పూర్తి చేసిన తర్వాత యాక్టర్ గా  కెరీర్ మొదలు పెట్టాడు. 

8 /11

మహేష్ బాబు (Mahesh Babu) సూపర్ స్టార్ మహేష్ బాబు  చెన్నైలోని లయోలా కాలేజ్ లో హానర్స్ డిగ్రీ ఆఫ్ కామర్స్ చదివారు. మహేష్ స్కూలింగ్ మొత్తం చెన్నైలోనే జరిగింది. ఈయనకు తెలుగులో చదవడం, రాయడం రాదు.

9 /11

ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ రేంజ్ ప్యాన్ ఇండియా కాదు.. గ్లోబల్ స్టార్ అయ్యాడు. హైదరాబాద్, సెయింట్ మేరీస్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ వరకు చదవుకున్నారు. అప్పటికే సినిమాల్లో స్టార్ ఇమేజ్ రావడంతో అక్కడే సెటిలైపోయారు.

10 /11

రామ్ చరణ్.. రామ్ చరణ్.. లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ‘చిరుత’ సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేశారు.

11 /11

అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ కమ్ ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్.. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎమ్మెస్ఆర్ కాలేజ్, హైదరాబాద్ లో పూర్తి చేశారు. తాజాగా పుష్ప 2 మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో హీరోగా సత్తా చాటారు.