Casting Couch: కన్నడ బ్యూటీ శృతి హరిహరన్ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఐదు మంది నిర్మాతలు తనతో అసభ్యంగా ప్రవర్తించారు అంటూ తెలిపి ఆశ్చర్యపరిచింది. కాస్టింగ్ కౌచ్ గురించి కొద్దీ రోజులగా అన్ని ఇండస్ట్రీలలో.. పెద్ద ఎత్తున వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది తమకు జరిగిన అన్యాయాలను అలానే పక్కన వారు ఎదుర్కొంటున్న అన్యాయాలను కూడా బయటపెడుతున్నారు. ఈ క్రమంలో ఈ నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఏ విషయం జరిగినా సరే క్షణాల్లో.. వైరల్ అవుతుంది. అందులో ఒకటి మహిళల వేధింపులు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ నటనతో గుర్తింపు తెచ్చుకొని, నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకుంటున్న ఎంతోమంది అమ్మాయిలు.. ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య క్యాస్టింగ్ కౌచ్.
ఇప్పటికే ఎంతోమంది నటీమణులు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ కన్నడ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శృతి హరిహరన్ కూడా ఆ జాబితాలోకే చేరిపోయింది .గత నాలుగు సంవత్సరాల క్రితం తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంది.
మీ టూ వివాదం సందర్భంగా ప్రముఖ నటుడు అర్జున్ సర్జపై ఈమె చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. దీంతో శృతి హరిహరన్ పేరు బాగా వైరల్ అయింది. కానీ ఈమె చేసిన ఆరోపణలు ఆ తర్వాత కాలంలో నిజం కాలేదు. దీంతో ఆమెపై పలువురు విమర్శలు గుప్పించారు. ఇక ఈ మధ్య కోలీవుడ్ నిర్మాతల గురించి తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తెలియజేయడంతో ఆ విషయాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఈ విషయంపై శృతి హరిహరన్ మాట్లాడుతూ.. ఒక కోలీవుడ్ దర్శకుడు నాకు తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఈ విషయం తెలియగానే ఎగిరి గంతేశాను. అయితే ఆ చిత్రానికి 5 మంది నిర్మాతలు. ఇక వారు మాత్రం ఈ సినిమాలో నీకు అవకాశం కావాలి అంటే మేము పక్కలోకి రమ్మని పిలిచినప్పుడు తప్పకుండా రావాలి అంటూ నాకు షరతులు విధించారు. ఇలాంటి దురుధ్యేశం నాకు ముందే ఉంటే నా చేతినిండా వరుస సినిమాలు ఉండేవి .కానీ నేను అలాంటి దాన్ని కాదు అని మొహం మీదే చెప్పేశాను అంటూ ఆరోపించింది శృతి హరిహరన్.
ప్రస్తుతం శృతి హరిహరన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఆదర్శకుడు ఎవరు ? ఆ చిత్ర నిర్మాతలు ఎవరు ? అసలు ఆ సినిమా ఏంటి ? అనే విషయాలు మాత్రం ఆమె వెల్లడించలేదు