Kia Syros vs. Skoda Kylaq: ఈ రెండు కార్లలో ఏది బెస్టో తెలుసా? ఫీచర్స్‌ పరంగా ఇదే ది బెస్ట్ గురూ..

Kia Syros vs. Skoda Kylaq: ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన కియా సిరోస్‌ ఫీచర్స్‌.. స్కోడా కైలాక్ ఫీచర్స్‌ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌, స్పెఫిషికేషన్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 1, 2025, 03:13 PM IST
Kia Syros vs. Skoda Kylaq: ఈ రెండు కార్లలో ఏది బెస్టో తెలుసా? ఫీచర్స్‌ పరంగా ఇదే ది బెస్ట్ గురూ..

Kia Syros Vs Skoda Kylaq Comparison: కియా సిరోస్‌ త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఇప్పటికే కంపెనీ లాంచింగ్‌ కోసం అన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది మార్కెట్‌లోకి విడుదలై ఇటీవలే విడుదలైన చాలా ప్రీమియం కార్లతో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రావడం చాలా మంది ఈ కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అయితే ఈ కారు ఇటీవలే విడుదలైన స్కోడా కైలాక్‌ కారు ఫీచర్స్‌ను అధిగమించే ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పరంగా ఈ రెండింటిలో ఏ కారు ముందు వసరలో ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.

10 లక్షల బడ్జెట్‌తోనే అద్భుతమైన కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కియా సిరోస్‌ ది బెస్ట్‌ ఆప్షన్‌.. ఈ కారు అద్భుతమైన ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరలో అందుబాటులోకి రాబోతోంది. కియా కంపెనీ ఈ కారు ఆటో ఎక్స్‌పో 2025లో భాగంగా అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే సిరోస్‌ కారును సోమవారం మార్కెట్‌లోకి లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారులో ఫీచర్స్‌ చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా గతంలో లాంచ్‌ అయిన స్కోడా కైలాక్ కంటే మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది.

కియా సిరోస్ ఫీచర్లతో పాటు స్పెషిఫికేషన్స్‌, ధర వివరాల్లోకి వెళితే..ఇది అద్భుతమైన 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఇందులో EBD, ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే స్పెషల్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఫీచర్‌తో పాటు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్, 360-డిగ్రీ కెమెరాలను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు డ్యూయల్ డాష్‌క్యామ్ సెటప్, లెవల్-2 ADAS వంటి అధునాతన ఫీచర్స్‌ కూడా కలిగి ఉండబోతోంది.

కియా సిరోస్ నూతన టెక్నాలజీతో కూడిన అనేక రకాల అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. ఇది ఎంతో శక్తివంతమైన 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా హై ఎండ్‌ మోడల్‌ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇక దీని ధర వివరాల్లోకి వెళితే.. దీని బెస్‌ వేరియంట్‌ ధర రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి  అందుబాటులోకి రానుంది. అలాగే ఇప్పటికే బుకింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. 

ఇక స్కోడా కైలాక్ ఫీచర్లు, ధర ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఈ కారు ఎంతో శక్తివంతమైన  1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో విడుదలైంది. అంతేకాకుండా దీని ఇంజన్‌ 114 బిహెచ్‌పి పవర్‌తో పాటు 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో 6-స్పీడ్ మ్యాన్యువల్ గెర్‌ బాక్స్‌ కూడా లభిస్తోంది. అంతేకాకుండా ఈ SUV అద్భుతమైన బిల్డ్ క్వాలిటీతో విడుదలైంది. దీంతో పాటు స్పెషల్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD వంటి ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీని ధర రూ. 8 లక్షల కంటే చాలా తక్కువనే చెప్పొచ్చు. భద్రత పరంగా ఈ కారు అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. 

ఇది చదవండి: Huge King Cobra Video: పప్పు డబ్బాల్లో నుంచి బయటికి వచ్చిన భారీ కింగ్ కోబ్రా.. ఈ వీడియో అస్సలు భయపడకండి!

ఇది చదవండి: Huge King Cobra Video: పప్పు డబ్బాల్లో నుంచి బయటికి వచ్చిన భారీ కింగ్ కోబ్రా.. ఈ వీడియో అస్సలు భయపడకండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News