Health Hair Care Tips: కొన్ని సాధారణ చిట్కాలు పాటిస్తూ జుట్టు రాలే సమస్యకు పెట్టవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఎందుకంటే ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవు. నేచురల్ కాబట్టి మన జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.
కొబ్బరి నూనె..
కొబ్బరి నూనె మన జుట్టుకు లోతుగా పోషణ అందిస్తుంది. ఇందులో జుట్టు పెరుగుదలకు తోడ్పడే గుణాలు ఉంటాయి. ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. జుట్టును బలంగా మారుస్తాయి. జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తుంది. తల స్నానం చేసే ముందు వేడి చేసిన కొబ్బరి నూనె జుట్టుకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేసి, కండిషనర్ అప్లై చేయడం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయి.
చేప నూనె..
చేప నూనెతో కూడా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫిష్ ఆయిల్ కి సంబంధించిన సప్లిమెంట్స్ కూడా దొరుకుతాయి. జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి. హెయిర్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఈ సప్లిమెంట్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కుదుళ్లు పొడిబారే సమస్యలకు కూడా చెప్పి పెడుతుంది.
కరివేపాకు..
కరివేపాకు మనం డైట్లో చేర్చుకోవడం వల్ల కూడా రాలే సమస్య, త్వరగా తెల్లబడే సమస్య నుంచి అధిగమించవచ్చు. కొబ్బరి నూనెలో కరివేపాకు ఆకులు వేసి బాగా మరిగించి ఆ నూనెను చుట్టుకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తుంది.
కలబంద..
కలబందలో నయం చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి. మన హెయిర్ కేర్ రొటీన్ లో కచ్చితంగా ఉండాల్సిందే. కుదుళ్ల ఆరోగ్యానికి సహాయపడతాయి. హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ కాకుండా జుట్టును పెరిగేలా చేస్తుంది. కలబంద పీహెచ్ లెవెల్స్ ని కూడా సమతులం చేస్తాయి. ఇది నేచురల్ కండిషనర్ లాగా కూడా జుట్టుకు సహాయపడుతుంది.
ఎగ్ మాస్క్..
గుడ్డుతో జుట్టుకు మాస్క్ వేయడం వల్ల కూడా జుట్టు పెరుగుతుంది.. ఇందులో ఖనిజాల పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్, జింక్, సల్ఫర్, ఐరన్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. అంతేకాదు జుట్టు మెరిసేలా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ఉల్లిపాయ రసం..
ఉల్లిపాయ రసం మన జుట్టును పెరిగేలా ప్రేరేపిస్తుంది. ఇది మన కుదుళ్ల బ్లడ్ సర్కులేషన్ మెరుగు చేస్తుంది. ఇందులో సల్ఫర్ కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఇదీ చదవండి: స్ట్రాబెర్రీ ఈ రహస్యం తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు, రోజూ తింటారు..
బీట్ రూట్ ..
బీట్ రూట్లో విటమిన్ సి, బి6, ఫోలెట్, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండటం వల్ల కుదుళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు బలంగా పెరుగుతుంది.
ఇదీ చదవండి: ఈ బీఎస్ఎన్‌ఎల్ బంపర్ ప్లాన్‌తో మీ సిమ్ 10 నెలలు యాక్టీవ్.. ఉచిత కాలింగ్‌తోపాటు డేటా ఫ్రీ..
వెల్లుల్లి..
వెల్లుల్లి జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తుంది. ఇది బ్లడ్ సర్కులేషన్ మెరుగు చేస్తుంది. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది. ముఖ్యంగా కుదుళ్లకు మంచి పోషణ అందించి హెయిర్ ఫాలికల్స్ ని బలంగా ఉండేలా సహాయపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.