Lady Aghori: లేడీ అఘోరి మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేసింది. కరీంనగర్ సమీపంలోని మల్కాపూర్ గ్రామంలోని ఓ భక్తురాలు ఇంటికి వచ్చింది. సమాచారం తెలుసుకున్న ఎన్టీపీసీ పోలీసులు గ్రామంలోని తోట రామయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు. అక్కడ పూజలు చేసిన అఘోరి భోజనం చేసి బయటికి వచ్చింది. గ్రామస్తులు, మీడియా, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అఘోరి ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్దిసేపు పోలీసులతో వాగ్వివాదానికి దిగింది.
అంతేకాదు పోలీసులపై బూతు పురాణం పఠించింది. అయినప్పటికీ అఘోరి ని ఎవరు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. కొద్దిసేపు గ్రామంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అక్కడి నుంచి బయలుదేరిన అఘోరి తన కారులో ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళింది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
అక్కడ ఒంటిపై ఉన్న గుడ్డలను తొలగించి మరింత హంగామా సృష్టించింది. పోలీస్ స్టేషన్ అంతా కలియతిరిగి హంగామా చేసి తన కారులో అక్కడి నుంచి జారుకుంది. రాజీవ్ రహదారి పక్కనే పోలీస్ స్టేషన్ ఉండడంతో పెద్ద ఎత్తున జనాలు అఘోరి మాత్రం చూసేందుకు వచ్చారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.