AP Inter Exams: ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి ఏడాది పరీక్షా విధానంపై యూటర్న్ తీసుకుంది. మొదటి ఏడాది కూడా యధావిధిగా పబ్లిక్ పరీక్షలు నిర్వహించనుంది. ప్రభుత్వం యూ టర్న్ తీసుకోడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.
ఇంటర్ మొదటి ఏడాది పరీక్షల విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ఏపీలో ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది. ఇంటర్మీడియట్లో ప్రతిపాదిత సంస్కరణలపై తల్లిదండ్రులు, మేధావుల నుంచి వచ్చిన సూచనలతో ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. మొదటి ఏడాది పబ్లిక్ పరీక్షలు లేకపోతే విద్యార్ధులు సీరియస్‌గా తీసుకోకుండా చదువుపై ఫోకస్ తగ్గుతుందని మెజార్టీ తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో ఇంటర్నల్ మార్కుల విధానం తొలగించి తిరిగి పబ్లిక్ పరీక్షల్ని యథావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇక వచ్చే ఏడాది నుంచి కూడా ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి.
అదే విధంగా ఎన్సిఈఆర్టి సిలబస్ మాత్రం ప్రకటించిన విధంగానే అమలు కానుంది. కొత్త విధానం ప్రకారం మేథ్స్ ఏ, బీ పేపర్లు ఉండవు. ఒకే పేపర్ ఉంటుంది. బోటనీ, జువాలజీ వేర్వేరుగా కాకుండా ఒకటే బయోలజీ ఉంటుంది. ఇంగ్లీష్ తప్పనిసరి ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ విద్యార్ధుల ఇష్టాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు.
Also read: WhatsApp Governance: ఏపీ ప్రజలకు శుభవార్త, రేపట్నించే వాట్సప్ గవర్నెన్స్, ఏయే సేవలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి