National Pension System: తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీం 2025 ఏప్రిల్ 1 నుంచి అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతోనే కొంత పెన్షన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పాత పెన్షన్స్ స్కీం.. నేషనల్ పెన్షన్ సిస్టం లోని పలు ప్రయోజనాల కలయికతో యుపిఎస్ స్కీంని రూపొందించారు.
అయితే ఇప్పుడు ఈ విధానంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత నెలకొంది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఈ విధానం తీసుకురావాలని నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ రెండింటిని సమ్మిళితం చేసి యూనిఫైడ్ పెన్షన్ స్కీం కి ప్రకటించింది. ఇప్పటికే నేషనల్ పెన్షన్ సిస్టం లో రిజిస్టర్ అయిన ఉద్యోగులు కూడా ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. కానీ ఈ పథకం వద్దు అని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం.
ఈ నేపథ్యంలోని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో యుపిఎస్ వద్దు అని రాసిన ప్రతులతో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ జగిత్యాల జిల్లా కార్యదర్శి అయిన బండారి సతీష్ మాట్లాడుతూ.. యుపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, గత దశాబ్ద కాలంగా పోరాటం చేస్తుంటే.. కానీ కేంద్ర ఆర్థిక శాఖ.. కార్పొరేట్ శక్తులకు తలోగ్గి ఈ యుపిఎస్ విధానాన్ని తీసుకురావడం ప్రజాస్వామికమని, కేవలం షేర్ మార్కెట్లోకి నిరంతరాయంగా పెట్టుబడిలో పెట్టే విధంగా ఉందే తప్ప, దీనిలో ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబ సామాజిక భద్రత కోణం లేదని ఆయన విమర్శించారు.
ముఖ్యంగా ఈ విధానం వల్ల ఉద్యోగి తన సర్వీస్ కాలంలో.. ప్రతినెల బేసిక్ + డి ఎ లో పది శాతం చొప్పున జమ చేసిన సొమ్మును ఎన్పీఎస్ ట్రస్టుకు బదిలీ చేసిన తర్వాతనే ఉద్యోగికి సర్వీస్ పెన్షన్ నిర్ణయించడం అనేది అత్యంత దారుణమైన పని అని కూడా ఆయన వ్యతిరేకించారు. ముఖ్యంగా ఉద్యోగులకు కంట్రిబ్యూషన్ లేకుండా పెన్షన్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, సుప్రీంకోర్టు నకారా కేసును కూడా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సుందరికారి రాజేష్, మ్యాన పవన్ కుమార్, చల్ల కృష్ణ, పురం స్వప్న, అసిఫ్ బేగ్, మహేష్, సింధూజ, సీనియర్ ఉపాధ్యాయులు వెంకటరమణ చంద్రశేఖర్ , నరహరి, శ్రీకాంత్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు చేపడుతున్నారు.
Also Read: Sara Tendulkar: కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సచిన్ గారాల పట్టీ సారా టెండూల్కర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.