Airtel Voice Calling Plans: దేశంలోని ప్రముఖ టెలీకం కంపెనీ ఎయిర్టెల్ నుంచి మరో రెండు రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో వచ్చాయి. ట్రాయ్ ఆదేశాల మేరకు డేటా లేకుండా కేవలం వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యం అందించే ప్లాన్స్ ఇవి. సగటు వినియోగదారుడికి భారంగా కాకుండా వాయిస్ కాలింగ్ ప్లాన్స్ ప్రవేశపెట్టాలని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగానే ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియాలు కొన్ని ప్లాన్స్ తీసుకొచ్చాయి.
ముఖ్యంగా ఎయిర్టెల్ ట్రాయ్ ఆదేశాల మేరకు కేవలం వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ ఉండే రెండు ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది.మొబైల్ డేటా వినియోగించనివారికి, కీ ఫ్యాడ్ ఫోన్ వాడేవారికి డేటా లేని ప్రత్యేక ప్లాన్స్ అందించాలనేది ట్రాయ్ ఆదేశం. ఇందులో భాగంగానే ఎయిర్టెల్ రెండు ప్లాన్స్ తీసుకొచ్చింది. ఇవి 1849 రూపాయలు, 469 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ప్లాన్స్ ఫీచర్లు, ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
ఎయిర్టెల్ 1849 రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, ఏడాదిలో 3600 ఎస్ఎంఎస్లు ఉంటాయి. ఇవి కాకుండా హెలో ట్యూన్ ఉచితంగా అందుతుంది. ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్‌తో యాక్సెస్, మూడు నెలల అపోలో సభ్యత్వం లభిస్తాయి.దీర్ఘకాలం వ్యాలిడిటీ కోసం చూసేవారికి ఇది బెస్ట్ ప్లాన్.
ఎయిర్టెల్ 469 రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్లు ఉంటాయి. ఎలాంటి ఇంటర్నెట్ డేటా ఉండదు. హెలో ట్యూన్ ఉచితంగా పొందవచ్చు. మొన్నటి వరకూ ఇదే ప్లాన్ 499 రూపాయలకు ఉండేది. ఇటీవలే కంపెనీ 30 రూపాయలు తగ్గించింది. అదే విధంగా 1849 రూపాయల ప్లాన్ కూడా పది రూపాయలు తగ్గింది.
రిలయన్స్ జియో 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను 458 రోజులకు అందిస్తోంది. అన్లిమిటెడ్ కాలింగ్, 1000 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. చాలామందికి డేటా అవసరం ఉండదు. కీ ప్యాడ్ ఫోన్ ఉపయోగిస్తుంటారు. వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్పైనే ఆధారపడుతుంటారు. అలాంటివారికి ఈ ప్లాన్స్ ఉపయోగకరం.
Also read: Chandrababu U Turn: సూపర్ సిక్స్‌పై చంద్రబాబు యూ టర్న్, జగన్ చేతికి అస్త్రం లభించేసిందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి