Sai Pallavi Thandel Trailer: గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్య.. ఇప్పుడు చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి .
ముఖ్యంగా ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది.
ఇక అందుకే మళ్లీ ఈ కాంబోని రిపీట్ చేస్తూ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను వైజాగ్ లో భారీ ఈవెంట్ నిర్వహించి మరీ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది అనే విషయం ఇప్పుడు చూద్దాం.
మత్స్యకారుల నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి మరొకసారి అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. డి గ్లామరస్ గా కనిపించిన వీరిద్దరూ కూడా మరొకసారి తమ అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేశారు.శ్రీకాకుళం యాసలో నటీనటులు ఇద్దరూ కూడా లీనమై నటించారు.
ట్రైలర్ చూస్తుంటే.. హీరో, హీరోయిన్స్ ప్రేమ కథతో మొదలై..హీరో వేటకు వెళ్లే వాళ్లందరికీ కూడా తండేల్ గా ఎన్నిక అవడం.. వేటకు వెళ్లాలని చూస్తే హీరోయిన్ మాత్రం వద్దనడం.. వేటకు వెళ్లాక అనుకోకుండా పాకిస్తాన్ జనాలలోకి వెళ్లి అక్కడి వాళ్లకు చిక్కడం.. ఇక అక్కడినుంచి హీరో, మిగిలిన వాళ్ళు ఎలా బయటపడ్డారు. వీరు బయటపడడానికి హీరోయిన్ ఎలా సహాయం చేసింది అనే అంశాలతో చాలా థ్రిల్లింగ్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ ఈ ట్రైలర్ ని మరింత ఆకర్షణీయంగా చేశాయి. ‘ఏడు సంవత్సరాల అవతల ఉన్న ఎత్తుకొని వచ్చి ఇక్కడ పడేస్తా’.. ‘నువ్వు నాకు వేడినీళ్లతో స్నానం చేయిస్తే ఇష్టం..’లాంటి డైలాగ్స్ ఈ సినిమాలో లవ్ స్టోరీ ఎంతో సరదాగా అలానే ఎమోషనల్ గా సాగుతుంది అని చెప్పకనే చెప్పాయి.
ముఖ్యంగా శ్రీకాకుళం కి చెందిన పలువురు మత్స్యకారుల జీవిత కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అని ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే చెప్పిన సంగతి తెలిసిందే. సినిమాని కూడా శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కించడం జరిగింది. యాక్షన్ సీన్స్ కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సాయి పల్లవి ,నాగచైతన్య కూడా శ్రీకాకుళం యాసలో మెప్పించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మరి ఈ సినిమా నాగచైతన్య కెరియర్ లో ఎలాంటి విజయం అందిస్తుందో వేచి చూడాలి.
Also Read: Sara Tendulkar: కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సచిన్ గారాల పట్టీ సారా టెండూల్కర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.