Hindustan Petroleum Corporation Limited Careers: నిరుద్యోగ యువతకు హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బంపర్ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ సంస్థలో ఉన్న వివిధ ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్‌లో భాగంగా వివరించింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కెమికల్, మెకానికల్, ఇతర ఇన్స్ట్రుమెంటల్ విభాగంలో ఉన్న జూనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు కోరుతున్నట్లు నోటిఫికేషన్‌లో భాగంగా పేర్కొన్నారు. అయితే ఈ జాబ్స్‌కి మీరు కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారా?
ఈ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) నోటిఫికేషన్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 14 కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సంస్థలో ఖాళీ ఉన్న 234 ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నట్లు సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ విభాగంలో ఖాళీ ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ జాబ్ నోటిఫికేషన్ లో భాగంగా విద్యార్హతను కూడా పేర్కొంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి కోర్స్ పూర్తి చేసిన వారికి ఈ ఉద్యోగం అప్లై చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.
అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతాలను కూడా నోటిఫికేషన్లో ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.30 వేల నుంచి రూ.1.2 వరకు జీతం చెల్లించబోతున్నట్లు పేర్కొంది. ఇక వయసుకు సంబంధించిన అర్హతలను కూడా తెలిపింది. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. వయస్సు పరిమితిలో భాగంగా కూడా తడలింపులను కూడా తీసుకువచ్చింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కి సంబంధించిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు పాటు వయస్సు పరిమితిని కలిగి ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. అంతేకాకుండా వికలాంగులకు 10 సంవత్సరాల పాటు వయస్సు సడలింపులను కలిగి ఉన్నట్లు వెల్లడించారు.
ఇక ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఉద్యోగం అప్లై చేసుకునే వారికి ప్రత్యేకమైన ఎంపిక విధానం ఉంటుంది. ముందుగా వీరిని కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాయించి.. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్, ప్రత్యేకమైన టాస్కులు నిర్వహించి.. చివరగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.. ఈ నోటిఫికేషన్ లో పరీక్షా ఫీజును కూడా వెల్లడించారు. ఇందులో భాగంగా తప్పకుండా రూ.1180 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter