Samsaptak Raj Yoga Effects In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం కాలానికి అనుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాశికి తప్పకుండా ప్రవేశిస్తూ ఉంటుంది. దీనిని జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారంగా చెప్పకుంటారు. కొన్ని గ్రహాలు ప్రతినెల ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తే.. మరికొన్ని గ్రహాలు ఇలా సంచారం చేయడానికి దాదాపు 12 నుంచి 24 నెలలు పడుతుంది. అయితే ఈ గ్రహ సంచారం వల్ల అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయోజనాలను చేకూర్చితే మరికొన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఇదిలా ఉంటే కొన్ని సందర్భాల్లో ఒక గ్రహం ఇతర గ్రహంతో కూడా కలయిక జరుగుతుంది. దీనినే జ్యోతిష్య శాస్త్రంలో సంయోగంగా పిలుస్తారు. గ్రహ సంయోగాలకు కారణంగా ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ యోగాలు ఏర్పడడం వల్ల కూడా అన్ని రాశుల వారిపై స్పెషల్ ఎఫెక్ట్ పడుతుంది.
ఇదిలా ఉంటే జనవరి 14వ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు. అయితే ఈ గ్రహం దాదాపు నెల రోజులపాటు అదే రాశిలో సంచార దశలో ఉండబోతోంది. ఇప్పటికే ఈ గ్రహానికి సంబంధించిన ఆపోజిట్ స్థానంలో కుజుడు ప్రవేశించి ఉన్నాడు. అయితే ఈ రెండు గ్రహాలు ఎదురెదురు రాశుల్లో ఉండడం వల్ల ఎంతో శక్తివంతమైన 'సంసప్తక రాజ్యయోగం' ఏర్పడింది. ఈ యోగం ఎంతో అరదుగా ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ యోగం ఏర్పడడంతో ఇప్పుడు అన్ని రాశులపై మంచి, చెడు ప్రభావం పడింది. దీనివల్ల ఎక్కువ ప్రభావితమయ్యే రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
కన్యారాశి
'సంసప్తక రాజ్యయోగం' ఏర్పడడం వల్ల మొదటగా కన్యా రాశి వారిపై స్పెషల్ ఎఫెక్ట్ పడింది. దీనివల్ల వీరికి అద్భుతమైన విజయకాలం ప్రారంభమైందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరికి ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన గ్యారెంటీగా సక్సెస్ లభిస్తుందట. అలాగే వీరిపై వీరికి ఆత్మవిశ్వాసం పెరిగి ఎలాంటి పనులైన చేయగలుగుతారు. జీవితంలో విజయాలు సాధించేందుకు ఇదే సరైన సమయం. ముఖ్యంగా ప్రేమ జీవితంలో కొనసాగుతున్న వారు ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు, ఇప్పటికే వ్యాపారాలు ఉన్నవారు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది అద్భుతమైన ఛాన్స్. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల విశేష ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే అధిక మొత్తంలో డబ్బులు కూడా పొందుతారు. ముఖ్యంగా వీరు అనవసర వాదనాలకు దూరంగా ఉండడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారి కూడా ఈ శక్తివంతమైన యోగం వల్ల అద్భుతమైన సమయం ప్రారంభం కాబోతోంది. వీరికి మతపరమైన అంశాల పట్ల ఆసక్తి కూడా రెట్టింపు అవుతుంది. దీంతోపాటు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు సమయం అద్భుతంగా మారుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో చక్కటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలాగే ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోయి వీరు కూడా కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంది. ఎలాంటి పనులు చేసిన ఉత్సాహంగా ఉంటారు. మానసిక ప్రశాంతత కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా మారి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మతపరమైన పనులపై కూడా వీరికి కాస్త ఆసక్తి పెరిగి.. తీర్థ యాత్రలకు కూడా వెళ్లగలుగుతారు.
ధనుస్సు రాశి
స్థానికంగా ఉన్న ధనస్సు రాశి వారికి వ్యాపారాలపరంగా ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం కొన్ని అద్భుతమైన ప్రయోజనాలను అందించబోతోంది. కుటుంబ జీవితం గడిపే వారికి ఆనందకరమైన రోజులు ప్రారంభం కాబోతున్నాయి. అలాగే వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో ఆటంకాలు మొత్తం తొలగిపోతాయి. అంతేకాకుండా రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో పెద్ద పదవులు కూడా లభిస్తాయి అలాగే వివాహం కాని వారికి ఈ సమయం చాలా ప్రత్యేకంగా మారబోతోంది. ముఖ్యంగా కుటుంబ జీవితంలో సంతోషం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter