Union Budget 2025: ఈసారి కేంద్ర బడ్జెట్ 2025లో పన్ను మినహాయింపులు, జిఎస్టి రేటు నుంచి విధాన మార్పుల వరకు కీలక మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ఎవరు ప్రవేశపెడతారో తెలుసుకుందాం.
Union Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025 కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని సర్కార్ కసరత్తులు షురూ చేసింది. పలు రిపోర్ట్ ల ప్రకారం ఫిబ్రవరి 1, 2028న పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం ఉంటుంది. అయితే ఇంకా అధికారుల ప్రకటన వెలువడలేదు.
మోదీ 3.0 సర్కార్ రెండవ పూర్తి బడ్జెట్ అయిన కేంద్ర బడ్జెట్ 2025 ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సమర్పించాలని షెడ్యూల్ చేశారు. దీంతో కేంద్ర బడ్జెట్ను 8వ సారి ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మల సీతారామాన్ రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. అయితే రాబోయే బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతో వరుసగా 8వ కేంద్ర బడ్జెట్లను సమర్పించిన తొలి ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్ రికార్డ్ సాధిస్తారు.
గతంలో వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్ పేరు మీద ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే మొరార్జీ దేశాయ్ మొత్తం పది బడ్జెట్లను సమర్పించారు. వీటిలో 8 వార్షిక, రెండు మధ్యంతర బడ్జెట్లో ఉన్నాయి. ఇది ఇప్పటివరకు సమర్పించిన అత్యధిక బడ్జెట్ల రికార్డ్ హోల్డర్ గా నిలిచింది.
ఆర్థిక మంత్రి బడ్జెట్ను సమర్పించడం సాంప్రదాయంగా వస్తున్నప్పటికీ భారత చరిత్రలో ప్రధానమంత్రి దానిని సమర్పించాల్సిన పరిస్థితిలు కూడా ఉన్నాయి. మొదటి అత్యంత ప్రసిద్ధ ఉదాహరణ జవహర్లాల్ నెహ్రూ 1958లో అప్పటి ఆర్థిక మంత్రి టీ కృష్ణమాచారి అదే ఏడాది ఫిబ్రవరి 12న ముంద్రా కుంభకోణం వివరాలు బహిర్గపరచిన తరువాత రాజీనామా చేశారు. దీంతో నెహ్రూ ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను తీసుకున్నారు. అప్పుడు బడ్జెట్ను ఆయనే ప్రవేశపెట్టారు.
అలాగే 1969 లో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసినప్పుడు.. ఇందిరాగాంధీ 1970లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
1987 జనవరి రాజీవ్ గాంధీ కొత్త కాలం ఆర్థిక మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహించారు. ఎందుకంటే ఆ సమయంలో అతను ఆర్థిక మంత్రిగా ఉన్న బీపీ సింగ్ను తన స్థానం నుంచి తొలగించారు.
అయితే పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2025 ప్రవేశపెట్టడం గురించి కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి విషయాలను వెల్లడించలేదు. అయితే నిర్మల సీతారామన్ 2025 ఫిబ్రవరి 1న శనివారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను సమర్పించాలని భావిస్తున్నారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
అయితే కొత్త ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వం వృద్ధి మందగించవచ్చని బ్రోకరేజి సంస్థ గోల్డ్ మాన్ శాక్స్ అంచనా వేసింది. 2024 ఆర్థిక ఏడాదిలో 17% గా ఉన్న పబ్లిక్ క్యాంపెక్స్ కొత్త ఆర్థిక సంవత్సరంలో 13 శాతం పెంచుతామని అంతకుముందు మూడేళ్లలో ఆరోగ్యకరమైన వృద్ధిని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది.