Fake rs 300 tickets scam in Tirumala: తిరుమల ఇటీవల ఎక్కువగా వివాదాలతో వార్తలలో ఉంటుంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో టోకెన్ల జారీలో ఆరుగురు భక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. మరో 40 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆతర్వాత కూడా తిరుమలలో ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత పండుగ రోజు.. తిరుమల లడ్డు కౌంటర్ లో అగ్ని ప్రమాదం కూడా సంభవించింది.
ఇలా వరుసగా తిరుమలలో ప్రతిరోజు ఏవో ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. తిరుమలలో ప్రత్యేక దర్శనం రూ. 300 ల ఫెక్ టికెట్లు విక్రయిస్తున్నస్కామ్ ను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. దీనిలో టీటీడీ ఉద్యోగి కూడా ఉన్నట్లు గుర్తించారు.
ముఖ్యంగా.. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. రూ. 300 ప్రత్యేక దర్శనం ప్రవేశ కౌంటర్ ఉద్యోగి లక్ష్మీపతి, ఫైర్ శాఖ సిబ్బంది మణికంఠ, భాను ప్రకాశ్, ట్యాక్సీ డ్రైవర్ లు.. శశి, జగదీశ్ లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో.. శశి తిరుమలలో , జగదీశ్ చెన్నై కు టికెట్లు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు.
హైదరబాద్, ప్రొద్దుటూరు, బెంళూరు చెందిన 11 మంది భక్తుల నుంచి దాదాపుగా.. రూ. 19 వేలు వసూలు చేసినట్లు పోలీసులు విచారణలో బైటపడింది. దీంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు వీరిని అదుపులోకి తీసుకుని తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో మరోసారి తిరుమల శ్రీవారి ఆలయం వార్తలలో నిలిచింది.
మరోవైపు ఇటీవల తిరుమలలో పరాకామణిలో ఒక వ్యక్తి శ్రీవారి బంగారు బిస్కట్ ను దొంగిలించడానికి ప్రయత్నించి అరెస్ట్ అయ్యాడు. అతడ్ని అదుపులోకి విచారిస్తే.. గతంలో కూడా పరాకమణిలో ఇలాగే.. పలు మార్లు చోరీలు చేసినట్లు చెప్పడంతో పోలీసులు విస్తు పోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter