Teen girl attacks on auto driver in uttar Pradesh: ఇటీవల కాలంలో కొంత మంది అమ్మాయిలు తరచుగా వార్తలలో ఉంటున్నారు. తాగి రోడ్ల మీద హైడ్రామా చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ ల కోసం కొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో వాళ్లకు చెప్పకుండా తాగి రచ్చ చేస్తున్నారు. అంతే కాకుండా.. కొంత మంది అమ్మాయిలు ఒక అడుగు ముందుకు వేసి.. అబ్బాయిల్ని బెదిరింపులకు కూడా దిగుతున్నారు.
Mirzapur की यह घटना बेहद ही निंदनीय है 😐
महिला होने का यह अर्थ नहीं कि किसी गरीब रिक्से वाले को अभद्रतापूर्ण व्यवहार कर उसे प्रताड़ित करें |इस घटना की स्पष्ट रुप से जांच होना चाहिए।#Mirzapur #news pic.twitter.com/A8zsN8ZnZm
— गहड़वाल साहब (@The_Gaharwar) January 14, 2025
తాము చెప్పినట్లు వినకుంటే.. అత్యాచార ప్రయత్నం చేశావని, అంతే కాకుండా.. వేధిస్తున్నావని కేసులు పెడుతామంటూ కూడా రెచ్చిపోతున్నారు. అదే విధంగా ప్రస్తుతం ఇటీవల అబ్బాయిల కంటే.. అమ్మాయిలు, పెళ్లి చేసుకున్న భార్యల వేధింపులు తాళలేక అబ్బాయిలు సూసైడ్ లు చేసుకున్న ఘటనలు ఎక్కువగా వార్తలలో నిలిచాయి. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
ఉత్తర ప్రదేశ్ లోని మిర్జాపూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక యువతి ఆటో ఎక్కింది. ఆమె దిగే స్టాప్ రాగానే.. ఆటో అతను డబ్బుల్ని ఇవ్వాల్సిందిగా అడిగాడు. దీంతో యువతి నన్నే డబ్బులు అడుగుతావా అంటూ రెచ్చిపోయింది. అంతేకాకుండా.. అతడ్ని కొడుతూ నానా బూతులు తిట్టింది. రోడ్డు మీదనే పొట్టు పొట్టు కొట్టింది. తన పట్ల అఘాయిత్యానికి పాల్పడ్డావని ఫిర్యాదుచేస్తానని రివర్స్ లో వేధించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. సదరు ఆటొ వ్యక్తి చార్జీకంటే ఎక్కువగా అడిగాడా లేదా మరేంటో క్లారిటీ లేదు కానీ.. అమ్మాయి అతట్నిపిచ్చికొట్టుడు కొట్టింది.
దీంతో అతను కాళ్లు పట్టుకుంటానని, వదిలేయాలని ఆమెను వేడుకున్నాడు. అయిన ఆమె ఆటో డ్రైవర్ పట్ల జులుం ప్రదర్శించింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ కిలేడీ అమ్మాయిలు చేసిన పని పట్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ లు ఏకీపారేస్తున్నారు. ఇలాంటి పనులు మానుకొవాలని.. కామెంట్లు చేస్తున్నారు. ఒక వేళ అతను తప్పు చేసుంటే.. మరోలా ట్రీట్ చేయోచ్చు.. ఇదేం కొట్టడం అంటూ మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter