Viral Video: వచ్చుండాయ్ పీలింగ్స్ పాటకు అమ్మాయిల ఊరమాస్ స్టెప్పులు.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియో..

Pushpa 2 movie: అల్లు అర్జున్ పుష్ప2 మూవీలోని వచ్చుండాయ్ పీలింగ్స్ పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ పాట మీద అమ్మాయిలు తాజాగా డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 14, 2025, 02:36 PM IST
  • మాస్ స్టెప్పులతో అదరగొట్టిన అమ్మాయిలు..
  • రచ్చగా మారిన వీడియో..
Viral Video:  వచ్చుండాయ్ పీలింగ్స్ పాటకు అమ్మాయిల ఊరమాస్ స్టెప్పులు.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియో..

Girls mass steps on pushpa 2 movie song: పుష్ప2 సినిమా బాక్సాఫీస్ మీద అన్నిరికార్డులను తిరగ రాసింది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా పుష్ప2 వైల్డ్ ఫైర్ కొనసాగుతుంది. ఈ మూవీ 1800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ మూవీలోని డైలాగ్ లు, పాటలు, ముఖ్యంగా జాతర సీన్ లు సినిమాకే హైలేట్ గా నిలిచాయి. వచ్చుండాయ్ పీలింగ్స్ మాత్రం సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.

ఈ పాటకు ఇప్పటికే ఇన్ స్టాలో ,  సోషల్ మీడియాలో అనేక మంది రీల్స్ చేసుకుంటూ పోస్టు లు  పెడుతున్నారు. ఈ పాటలో అల్లు అర్జున్, శ్రీవల్లి ఇద్దరు అదిరిపోయే విధంగా స్టేప్పులు వేశారు. ఒకరికి మరోకరు పోటా పోటీగా ఈ పాటలో స్టెప్పులు వేసి రచ్చ చేశారు.

 

అయితే.. ఈ పాటకు క్రేజ్ మరింతగా పెరిగిపోతుందని చెప్పుకొవచ్చు. తాజాగా.. కొంత మంది అమ్మాయిలు వచ్చుండాయ్ పీలింగ్స్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ వీడియో నెట్టింట దుమ్మురేపుతుంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమాలోని వచ్చుండాయ్ పీలింగ్స్ పాటకు కొంత మంది అమ్మాయిలు మాస్ స్టెప్పులతో అదరగొట్టారు.

Read more: Viral Video: రిటైర్డ్ ఐఏఎస్ ను ఇష్టమున్నట్లు కొట్టిన కండక్టర్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు.. వీడియో వైరల్.

 అమ్మాయిలంతా చీరలు ధరించి.. ఒకరికి మరోకరు ఏ మాత్రం తీసిపోకుండా డ్యాన్స్ తో అదరగొడుతున్నారు. వారి ఫెస్ ఎక్స్ ప్రెషన్స్, డ్యాన్స్ స్టెప్పులు చూస్తుంటే.. నిజంగా అక్కడికి వెళ్లి వాళ్లతో  కలిసి డ్యాన్స్ చేయాలని ఫీలింగ్ కల్గకుండా మానదు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News