Shankar: శంకర్ చేతిలో బలి కాబోతున్న స్టార్ హీరో..వద్దంటున్న ఫ్యాన్స్..!

Shankar next movie: భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరు డైరెక్టర్ శంకర్. ఈ డైరెక్టర్  సినిమాలు.. ఎక్కువగా ఏదైనా మెసేజ్, ఆలోచింపజేసే కథలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తారనే ముద్రపడింది. కానీ గత కొంతకాలంగా సరైన సక్సెస్ అందుకోలేక సతమతమవుతున్నారు. ఇటీవలే రామ్ చరణ్ తో  తెరకెక్కించిన గేమ్  ఛేంజర్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jan 13, 2025, 02:03 PM IST
Shankar: శంకర్ చేతిలో బలి కాబోతున్న స్టార్ హీరో..వద్దంటున్న ఫ్యాన్స్..!

Game Changer collections: ఒకప్పుడు వరుస పెట్టి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన దర్శకుడు శంకర్. అయితే ఈ మధ్య మాత్రం ఈ డైరెక్టర్ కి టైం అసలు బాగోలేదు. స్నేహితుడు, రోబో 2, భారతీయుడు 2, వంటి చిత్రాల నుంచి ఫ్లాపులు ఎదురయ్యాయి. ముఖ్యంగా శంకర్ సినిమాలలో.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వృధా ఖర్చులు  అవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. 

ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా రూ.92 కోట్లకు పైగా వృధా ఖర్చులే కనిపించాయనే టాక్ కూడా వినిపించింది. గతంలో తెరకెక్కించిన భారతీయుడు, జెంటిల్ మెన్ ,ఒకే ఒక్కడు, రోబో తదితర చిత్రాలలో ఇలాంటి ఖర్చులు అసలు కనిపించలేదు. అప్పుడు నిర్మాతలు కూడా అడిగినంత ఖర్చు చేసేవారు. కానీ ఈ మధ్య దుబారు ఖర్చు పెట్టడంతో చాలామంది విసిగిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

అందుకే డైరెక్టర్ శంకర్ తో తమిళంలో సినిమాలు చేయడానికి హీరోలు ముందుకు రాకపోవడంతో.. మొదట తెలుగులో చిరంజీవితో శంకర్ సినిమా అనుకున్నాడట. కానీ చివరికి రామ్ చరణ్తో ఓకే కాగా.. రామ్ చరణ్, దిల్ రాజు ఇద్దరు బలైపోయారు.. దీంతో కొన్ని కోట్ల రూపాయలు నష్టం దిల్ రాజుకు వచ్చే అవకాశము ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక తదుపరిచిత్రం శంకర్ తో ఎవరు చేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదట. దీంతో భారతీయుడు 3 సినిమా కూడా దాదాపుగా పూర్తి అయ్యిందని, త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సిద్ధంగానే ఉంది అని సమాచారం. కానీ ఇప్పటి తరానికి అనుగుణంగా,  వాస్తవికానికి అనుగుణంగా ఉండేలా సినిమాలు తీయడం కష్టమని సీనియర్ డైరెక్టర్లు భావించడంతో వారు దూరంగా ఉన్నారు.. అలా  తమ గౌరవాన్ని కాపాడుకుంటూ ఉండగా..శంకర్ మాత్రం అనవసరంగా గొప్పలకు పోయి..  నిర్మాతల చేతుల్లో కోట్ల రూపాయలను ఖర్చు చేసేలా కనిపిస్తోంది.

డైరెక్టర్ శంకర్ గతంలో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోలతో సినిమాలు చేయాలని ఉందనీ తెలిపారు.. కానీ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు రాజమౌళి సినిమా కావడం చేత మరో నాలుగేళ్లు దొరికే అవకాశం ఉండదు. ఇక చిరంజీవి యంగ్ డైరెక్టర్లకే మక్కువ చూపడంతో చివరికి రజనీకాంత్ బయోపిక్ లో నటించడానికి హీరో ధనుష్ శంకర్ కి ఓకే చెప్పాడని టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. మరి ఈ సినిమాకి ధనుష్ ఒప్పుకుంటాడా లేదా అనే విషయం తెలియాలి. దీంతో పలువురి నెటిజెన్స్ శంకర్ దెబ్బకు బలయ్యే హీరో ధనుష్ కావోచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాటలో కీలక పరిణామం.. నలుగురు ఆఫీసర్ల సస్పెండ్

Also Read: Tirupati Stampede: 'ఏడుకొండలు వాడా... స్వామి మమ్మల్ని క్షమించు'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News