CMF phone 1 Price Cut: సంక్రాంతి వేళ దిమ్మతిరిగే ఆఫర్స్‌.. CMF phone 1 ఫోన్‌పై రూ.11 వేల బోనస్.. అదనంగా మరెన్నో ఆఫర్స్!

CMF phone 1 Price Dropped: రిపబ్లిక్ డే సేల్స్‌తో పాటు సంక్రాంతి సేల్స్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. అదనంగా ఎన్నో రకాల బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jan 12, 2025, 03:19 PM IST
CMF phone 1 Price Cut: సంక్రాంతి వేళ దిమ్మతిరిగే ఆఫర్స్‌.. CMF phone 1 ఫోన్‌పై రూ.11 వేల బోనస్.. అదనంగా మరెన్నో ఆఫర్స్!

CMF phone 1 Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌లో ఇప్పటికే సంక్రాంతి సేల్‌తో పాటు రిపబ్లిక్ డే సేల్ కూడా ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రిక్ వస్తువులు అత్యంత తగ్గింపు ధరకే అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ సేల్‌లో భాగంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు కొన్ని ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌తో పాటు స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసే వారికి అత్యంత తగ్గింపు ధరకే పొందే అవకాశాన్ని లభిస్తోంది. ముఖ్యంగా కొన్ని మొబైల్స్ అయితే రేపు ప్రారంభం కాబోయే రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా అత్యంత తగ్గింపు ధరలకే లభించబోతున్నాయి. అలాగే వాటిపై కొన్ని స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభించనున్నాయి. ఈ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా ఏ బ్రాండ్ కి సంబంధించిన మొబైల్ అత్యంత చీప్ ధరకే లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి. 

సంక్రాంతి సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ ఇటీవలే నథింగ్ సబ్ బ్రాండ్ విడుదల చేసిన CMF 1 స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ప్రత్యేకమైన ఫీచర్స్‌తో ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది. అయితే ప్రస్తుతం దీని ధర మార్కెట్లో MRP రూ.21,999తో విక్రయిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ ఇప్పుడు రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌తో పాటు నాలుగు కలర్ వేరియంట్లను అందుబాటులో ఉంది. ఇందులోని 8జిబి వేరియంట్ పై ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం ప్రత్యేకమైన డిస్కౌంట్ అందిస్తోంది. అయితే దీనికి సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీని MRP ధరపై సంక్రాంతి సందర్భంగా ఏకంగా 27% వరకు తగ్గింపు అందిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఇక ఈ CMF 1 మొబైల్‌కు సంబంధించిన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్ ను సంక్రాంతి సందర్భంగా ఈరోజే కొనుగోలు చేసే వారికి ఏకంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు పై రూ.2 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి కొనుగోలు చేసే వారికి కూడా దాదాపు రూ.8 వంద వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ను ఇతర బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి కొనుగోలు చేసే వారికి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ లభించబోతోంది. అలాగే ప్రత్యేకమైన నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. 

ఈ  CMF 1 మొబైల్‌ను ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ తో కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ను వినియోగించి ఇప్పుడే కొనుగోలు చేస్తే ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ను వినియోగించాలనుకునేవారు ముందుగా పాత మొబైలను ఫ్లిప్‌కార్ట్‌కు ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.11 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ బోనస్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే మొబైల్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. మొబైల్ కండిషన్ బాగుంటే అధిక మొత్తంలో ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. లేకపోతే ఎక్స్చేంజ్ బోనస్‌లో మార్పులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఈ మొబైల్ పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ మొత్తం పోనూ రూ.1,999లోపే కొత్త మొబైల్ పొందవచ్చు.

Read More: Bank Job Recruitment: నిరుద్యోగులకు బంఫర్‌ ఛాన్స్‌.. ఏకంగా మేనేజర్ అవ్వొచ్చు.. తక్కువ కాంపిటీషన్‌ జాబ్‌ నోటిఫికేషన్‌! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News