Daggubati Family Case: దగ్గుబాటి కుటుంబానికి భారీ షాక్‌.. హీరోలు వెంకటేశ్‌, రానా, నిర్మాత సురేశ్‌బాబుపై పోలీస్‌ కేసు

FIR Lodged Against Venkatesh Rana And Suresh Babu: దగ్గుబాటి కుటుంబానికి భారీ షాక్‌ తగిలింది. ఓ ఆస్తి వివాదంలో హీరోలు వెంకటేశ్‌, రానా, అభిరామ్‌తోపాటు నిర్మాత సురేశ్‌ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో సినీ పరిశ్రమలో సంచలనం రేపింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 12, 2025, 11:36 AM IST
Daggubati Family Case: దగ్గుబాటి కుటుంబానికి భారీ షాక్‌.. హీరోలు వెంకటేశ్‌, రానా, నిర్మాత సురేశ్‌బాబుపై పోలీస్‌ కేసు

Daggubati Family Case: సినీ పరిశ్రమకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే నాగార్జున, అల్లు అర్జున్‌ తదితర ప్రముఖులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవగా.. తాజాగా దగ్గుబాటి కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలింది. ఓ ఆస్తి వ్యవహారంలో దగ్గుబాటి కుటుంబానికి వ్యతిరేకంగా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఆస్తి వ్యవహారంపై విచారణ చేయాలని హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: Special Shows: రేవంత్‌ రెడ్డి యూటర్న్‌.. గేమ్‌ ఛేంజర్‌కు భారీ షాక్‌: ధరల పెంపు, స్పెషల్‌ షోలు రద్దు

సిటీ సివిల్ కోర్టులో అంశం పెండింగ్‌లో ఉండగా.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేసిన  దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు మొట్టికాయలు వేసింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చి వేతలో కోర్టు ఆదేశాలున్నా పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ఫిలింనగర్ పోలీసులకు నాంపల్లిలోని 17వ నంబర్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Also Read: Retirement Benefits: ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల కీలక అడుగు.. రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ కోసం న్యాయపోరాటం

ఫిల్మ్ నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ అక్రమంగా కూల్చివేసిన ఆరోపణలపై హీరో దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్‌పై  శనివారం పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో బాధితుడు నంద కుమార్‌కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో  స్థలం వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. దీంతో ఈ విషయం కోర్టు పరిధికి చేరింది.

2022 నవంబర్‌లో జీహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి దక్కన్‌ హోటల్‌ను పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ అంశంలో యథాతథ స్థితి కొనసాగించాలని ఆ స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దన్న హైకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా 2024 జనవరిలో హోటల్‌ను దగ్గుబాటి కుటుంబం పూర్తిగా కూల్చివేసింది. దీంతో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేయాలని నందకుమార్ నాంపల్లి కోర్టుకు ఆశ్రయించారు. తాజాగా కోర్టు ఆదేశించడంతో వారిపై కేసు నమోదు చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News