Allu Arjun: పండగకు ముందే అల్లు అర్జున్‌కు గుడ్ న్యూస్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కోర్టు..

Pushpa 2 stampede case: అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకొవచ్చు. ఇక మీదట ప్రతి ఆదివారం చిక్కడ పల్లి పీఎస్ కు వెళ్లి సంతకం పెట్టాలనే నిబంధన నుంచి మినహియింపును ఇస్తు ఆదేశాలు జారీ చేసింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 11, 2025, 02:03 PM IST
  • అల్లు అర్జున్ తొక్కిసలాట కేసు..
  • బిగ్ రిలీఫ్ ఇచ్చిన నాంపల్లి కోర్టు..
Allu Arjun: పండగకు ముందే అల్లు అర్జున్‌కు గుడ్ న్యూస్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కోర్టు..

Nampally court orders on allu arjun case: పుష్ప2 ప్రీమియర్ షో నేపథ్యలో డిసెంబరు 4న హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే.. ఈఘటనలో మొత్తంగా 18 మందిపై పోలీసులు కేసుల్నినమోదు చేశారు. అల్లు అర్జున్ ను ఈ ఘటనలో.. ఏ 11 గా చేర్చారు.

అయితే.. అనేక నాటకీయ పరిణామల నేపథ్యంలో బన్నీకి మధ్యంతర బెయిల్ వచ్చింది. ఇటీవల నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ను ఇవ్వడంతో పాటు.. కండీషన్స్ పెట్టింది. ప్రతి ఆదివారం బన్నీ.. చిక్కడపల్లీ పీఎస్ కు వెళ్లి సంతకం చేయాలని ఆదేశించింది.

ఈ క్రమంలో హీరో అల్లు అర్జున్ తాజా.. నాంపల్లిలో ప్రతి ఆదివారం సంతకం చేయాలనే దానిపై మినహయింపును ఇవ్వడంతో పాటు, విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ ను బన్నీ దాఖలు చేశారు. ముఖ్యంగా..  భద్రత కారణాల రీత్యా ప్రతి ఆదివారం చిక్కడ పల్లి పీఎస్ కు వెళ్లలేనని మరల నాంపల్లి కోర్టు వారి ఎదుట పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

Reada more: Game Changer: గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ ఐఏఎస్ రోల్.. రియల్ లైఫ్‌లో పని బకాసురుడైన ఆ అధికారి ఎవరో తెలుసా..?.

ఈ క్రమంలో..   పిటిషన్ ను విచారించిన ధర్మాసనం..  ప్రతి ఆదివారం బన్నీ చిక్కడ పల్లి పీఎస్ ఎదుట హాజరు కావాలన్న నిబంధనను కోర్టు మినాహాయించింది. అదే విధంగా.. విదేశాలకు వెళ్లేందుకు కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఈ క్రమంలో బన్నీకి ఇది బిగ్ రిలీఫ్ గా చెప్పుకొవచ్చు. అల్లు అర్జున్ కు..  సంక్రాంతికి ముందే ఇవి గుడ్ న్యూస్ అంటూ.. అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారంట.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News