Hdfc Bank Recruitment 2025: ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకింగ్ సంస్థ HDFC నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ తెలిపింది. అతి త్వరలోనే రిలేషన్షిప్ మేనెజర్ ఉద్యోగ ఖాళీలకు PAN India రిక్రూట్మెంట్ చేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే నోటిఫికేషన్లో అన్ని రకాల వివరాలను క్లుప్తంగా పేర్కొన్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన విద్యార్హతలేంటో? దీనిని ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళితే.. రిలేషన్షిప్ మేనేజర్స్ అనే విభాగంలో భారతదేశ వ్యాప్తంగా ఈ రిక్రూట్‌మెంట్‌ను చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏ డిగ్రీ పూర్తి చేసిన వక్తులైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులకు సంబంధించిన స్కిల్స్ వివరాల్లోకి వెళితే.. నోటిఫికేషన్స్‌లో భాగంగా తప్పకుండా కొన్ని స్కిల్స్‌ను కలిగి ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. అలాగే ఒత్తిడి వాతావరణంలో కూడా పని చేసే సామర్థ్యం కలిగి ఉండాలి.
ఇక ఈ ఖాళీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ సంఖ్యను వెల్లడించలేదు. అలాగే ఈ రిలేషన్షిప్ మేనేజర్స్ విభాగంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. కనీసం 18 సంవత్సరాలు తప్పకుండా ఉండాలని పేర్కొన్నారు.
ఉద్యోగుల జీతం వివరాల్లోకి వెళితే.. ఎంపికైన అభ్యర్థులు ప్రతి నెల రూ.25 వేల వరకు జీతం అందిస్తున్నట్లు నోటిఫికేషన్లో క్లప్తంగా వెల్లడించారు. అప్లై చేసిన అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి షార్ట్ లిస్ట్ చేస్తారు. అంతేకాకుండా వాటిల్లో ఎంపికైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
అలాగే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించనక్కర్లేదు. దీనిని సులభంగా అన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాన్ని అప్లై చేసుకోవాలనుకునేవారు జనవరి 24వ తేది వరకే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.