komatireddy venkat reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి..?

తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కొత్త పీసీసీ అధ్యక్షున్ని నియమిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగించే అవకాశాలు లేవనే ప్రచారం కూడా జరుగుతోంది. 

Last Updated : Mar 12, 2020, 01:47 PM IST
komatireddy venkat reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి..?

తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కొత్త పీసీసీ అధ్యక్షున్ని నియమిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగించే అవకాశాలు లేవనే ప్రచారం కూడా జరుగుతోంది.  

ఐతే పీసీసీ అధ్యక్ష పదవిపై చాలా మంది కీలక నేతలు ఆశలు పెట్టుకున్నారు. అధిష్ఠానం ఎంపికే కీలకం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పీసీసీ అధ్యక్ష పదవి వరించే అవకాశం ఉందనే చర్చలు జరుగుతున్నాయి. ఐతే దీనికి బలం చేకూర్చేలా.. అధిష్ఠానం ఆయన్ను ఢిల్లీకి పిలిపించింది.  ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ..  ప్రస్తుతం కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో ఆమెతో భేటీ అయ్యారు.  తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన అంశాలను ఆమెకు వివరించినట్లుగా తెలుస్తోంది. 

Read Also: సీఎం కుర్చీపై రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ పీసీసీ అధ్యక్షున్ని త్వరలోనే నియమించే అవకాశం ఉన్న నేపథ్యంలో సోనియా గాంధీతో  కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read Also: ఛీ..ఛీ.. మీ తెలివి తెల్లారినట్టే ఉంది.. !!

Trending News