క్రికెటర్ జహీర్ ఖాన్ ఒక ఇంటియవాడయ్యాడు. తన ప్రేయసి, బాలీవూడ్ నటి సాగరిక ఘాట్గే ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే..! గురువారం ఉదయం అత్యంత సన్నిహితుల సమక్షంలో జహీర్- సాగరిక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరూ సంప్రదాయ దుస్తులు ధరించి పెళ్లి చేసుకున్నారు. జహీర్ జుబ్బా, పైజామా ధరించగా, సాగరిక భారతీయ చీర కట్టులో కనిపించింది. పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య జరిగినా.. రిసెప్షన్ మాత్రం ఘనంగానే ప్లాన్ చేశారట జహీర్. తాజ్ మహల్ ప్యాలెస్ లో నవంబర్ 27 వ తేదీన నిర్వహించనున్న రిసెప్షన్ కు క్రికెటర్లు, బాలీవూడ్ నటులు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు జహీర్ సన్నిహితురాలు అంజనా శర్మ.
జహీర్‌ఖాన్‌కు షాదీ ముబారక్