మూవీ రివ్యూ: శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ (Srikakulam sherlock holmes movie)
నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, సియా, భద్రమ్, అవినాష్ కురువిళ్ల, మురళీధర్ గౌడ్, నాగ మహేష్ తదితరులు
ఎడిటర్: అవినాశ్ గుల్లింక
సినిమాటోగ్రఫీ: మల్లిఖార్జున్ నారగాని
సంగీతం: సునీల్ కశ్యప్
ప్రొడక్షన్ హౌస్: శ్రీ గణపతి సినిమాస్
నిర్మాత: వెన్నపూస రమణా రెడ్డి
దర్శకత్వం: రైటర్ మోహన్
విడుదల తేది: 25-12-2024
తెలుగు టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా... అనన్య నాగళ్ల లీడ్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాక రమణా రెడ్డి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
ఈ సినిమాను 1991 నేపథ్యంలో తెరకెక్కించారు. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ నవలలో ప్రేరణ పొందిన వెన్నెల కిషోర్ ఓ ప్రైవేట్ డిటెక్టివ్. ఈయన శ్రీకాకుళంలో హై ప్రొఫైల్ కేసుల్లో పోలీసులకు తన వంతు సాయం చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొన్ని సమస్యలను ఫేస్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజే ఆ ఊరిలో ఓ సంఘటన జరగుతుంది. ఈ ఘటన తర్వాత శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ గా పేరున్న వెన్నెల కిషోర్ ఈ కేసులను ఎలా సాల్వ్ చేసాడనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
వెన్నెల కిషోర్.. ఈ యేడాది చారి 111 వంటి కామెడీ స్పై థ్రిల్లర్ తో ప్రేక్షకులను పలకరించారు. తాజాగా ఇపుడు ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ అంటూ చంటబ్బాయి తరహా కామెడీ డిటెక్టివ్. ముఖ్యంగా 1990 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను కథను మలుచుకొని.. ఓ కేసు ఇన్వెస్టిగేషన్ లో మలుపులను ఈ సినిమా ఆద్యంతం ఆసక్తిగా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా చేసాడు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్.. చంటబ్బాయి తాలూకా అంటూ ఈ సినిమాలో వెన్నెల కిషోర్ తో ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచాడు. క్రైమ్ థ్రిల్లర్ కథకు కామెడీని జోడించిన తెరకెక్కించిన విధానం బాగుంది. దర్శకుడిగా రైటర్ మోహన్ కు మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమాలో చంటబ్బాయి తో పాటు కొన్ని హాలీవుడ్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్స్ ప్రభావం ఈయన పై ఉందనుకుంటా. మధుబాబు డిటెక్టివ్ నవలలు.. యండమూరి సస్పెన్స్ థ్రిల్లర్ దర్శకుడిపై ఉన్నట్టు కనబడుతుంది. ఒక సన్నివేశం తర్వాత మరోక సీన్ లో ఏం జరుగుతుందనేది ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంలో సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా క్రైమ్ త్రిల్లర్ సినిమాల్లో మానవ సంబంధాలు.. కుటుంబ విలువను చూపించాడు దర్శకుడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సునీల్ కశ్యప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ వర్క్ తో ఆనాటి కాలాన్ని చూపించాడు. మధ్యలో అనన్య, రవితేజ ల మధ్య లవ్ సీన్స్ కొన్ని చిరాకు తెప్పిస్తాయి. ఎడిటర్ ఈ సన్నివేశాల్లో కాస్తంత దృష్టి పెడితే ఈ సినిమా రేంజ్ మరో లెవల్లో ఉండేదేమే.
నటీనటులు:
వెన్నెల కిషోర్ డిటెక్టివ్ పాత్రలో తన మార్క్ నటనతో నటించాడనే కంటే ప్రేక్షకులను సీట్లలో కదలకుండా చేశాడు. డిటెక్టివ్ పాత్రలోని అతి తెలివి తేటలు, భావోద్వేగాలు ఆడియన్స్ ను మెప్పిస్తాయి. వెన్నెల కిషోర్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గ పర్ఫెక్ట్ స్టోరీ. ఇక అనన్య నాగళ్ల మరోసారి తన మార్క్ నటనతో మెప్పించింది. వకీల్ సాబ్, పొట్టేల్, తంత్ర సినిమాల తర్వాత మరోసారి తన మార్క్ యాక్టింగ్ మెప్పించింది. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’.. చంటబ్బాయి తాలూకే..
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.