Christmas Wishes: మీ ఆత్మీయులు.. బంధుమిత్రులకు ఇలా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పండి

Christmas Messages And Wishes Greetings To Your Friends And Relatives: ప్రపంచమంతా క్రిస్మస్‌ పండుగకు సిద్ధమైంది. ఏసుక్రీస్తు జన్మించిన రోజును క్రిస్మస్‌గా చేసుకుంటుండడంతో ఈ పండుగకు మీ ఆత్మీయులకు.. బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి. వారి ఆనందంలో మీరు భాగస్వాములు అవ్వండి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 24, 2024, 11:48 PM IST
Christmas Wishes: మీ ఆత్మీయులు.. బంధుమిత్రులకు ఇలా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పండి

Christmas Wishes And Greetings: కరుణామయుడు.. పాపాలను తొలగించి పరిశుద్ధిడిని చేసే దేవుడు ఏసుక్రీస్తు. అతడి జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలను చేసుకుంటాం. క్రైస్తవుల ఆరాధ్య దైవం జన్మదినం సందర్భంగా డిసెంబర్‌ 25వ తేదీ బుధవారం క్రిస్మస్‌ పండుగ చేసుకునేందుకు అంతా సిద్ధమైంది. ప్రపంచ దేశాల్లో ఈ నెల రోజులు సంబరాలు జరుగుతుంటాయి. భారతదేశంలో క్రిస్మస్‌ ముందు ఈవ్‌ వేడుకలు.. ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు.. క్యారల్స్‌ సందడిగా జరిగాయి. ప్రభు నామస్మరణలో క్రైస్తవులు మునిగి తేలుతున్నారు. ఇక క్రిస్మస్‌ పండుగ సందర్భంగా విద్యార్థులకు మూడు రోజుల సెలవులు.. ఉద్యోగులకు ఒకరోజు సెలవు లభించింది.

Also Read: KCR Wishes: క్రీస్తు శాంతి మార్గం అద్భుతం.. ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

క్రిస్మస్‌ పండుగకు చర్చిలు.. ప్రార్థనాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. క్రిస్మస్‌ ట్రీలు.. విద్యుద్దీపాలంకరణతో క్రైస్తవుల తమ ఇళ్లను అందంగా అలంకరించుకున్నారు. కేక్‌లు.. రకరకాల పిండి వంటలు సిద్ధం చేసుకున్నారు. కొత్త దుస్తులు కొనుగోలు చేసి ప్రార్థన చేసేందుకు సిద్ధమయ్యారు. ఏడాదిలో వచ్చే ఒకే ఒక పండుగ అయిన క్రిస్మస్‌ను ఘనంగా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మరి వారికి శుభాకాంక్షలు ఎలా చెప్పాలో తెలుసా. మీ ఆత్మీయులకు.. స్నేహితులకు.. బంధుమిత్రులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు ఇలా చెప్పండి.

Also Read: Jr NTR Fan: జూనియర్‌ ఎన్టీఆర్‌పై విమర్శలపై యూటర్న్‌.. కౌశిక్‌ తల్లి వివరణ ఇదే!

శుభాకాంక్షలు ఇలా..

  • ప్రేమ.. కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం. ఆ శాంతిదూత జన్మదినమైన క్రిస్మస్‌ పర్వదినాన్ని మీరు, మీ కుటుంబసభ్యులు సుఖసంతోషాలతో చేసుకోవాలని ఆకాంక్షిస్తూ క్రిస్మస్‌ పండుగ శుభాకాంక్షలు.
  • హ్యాపీ క్రిస్మస్‌.. మీకు, మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు.
  • హ్యాపీ క్రిస్మస్‌. ఏసుక్రీసు ప్రేమ.. మీపై వర్షించు గాక. అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు.
  • ఏసుక్రీస్తు మీ అందరినీ సదా సంతోషంగా ఉంచాలని.. విజయాన్ని అందించాలని కోరుకుంటూ.. మీకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు.
  • మీ అందరికీ సకల సంపదలు.. శ్రేయస్సు కలగాలని ఆశిస్తూ.. క్రిస్మస్‌ శుభాకాంక్షలు.
  • ఎల్లవేళలా ఆ ప్రభువు మీ వెంట ఉండాలని.. మీకు కష్టాలు రాకుండా.. సుఖసంతోషాలు ప్రసాదించాలని ఏ యేసు ప్రభువును ప్రార్థిస్తూ క్రిస్మస్‌ శుభాకాంక్షలు.
  • అద్భుతమైన ఘట్టాలు మీ జీవితంలో ఆవిష్కారం కావాలని ఆశిస్తూ.. ఆ ప్రభువు చల్లటి దీవెనలు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ.. మీకు క్రిస్మస్‌ పండుగ శుభాకాంక్షలు.
  • మీ జీవితంలో ఆనందం ఎల్లప్పుడూ ఉండాలని.. ఏసుక్రీస్తు ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ క్రిస్మస్‌ శుభాకాంక్షలు. మేరి క్రిస్మస్‌.
  • మీ జీవితంలో సరికొత్త ఆనందానికి నాంది పలకాలని.. ఆ ప్రభువు దీవించాలని కోరుకుంటూ మేరి క్రిస్మస్‌.
  • శాంటాక్లాజ్‌ రూపంలో మీకు సుఖసంతోషాలు కలిసిరావాలని కోరుకుంటూ.. కష్టాసుఖాల్లో ఆ ప్రభువు మీకు ఎల్లప్పుడూ తోడు ఉంటాడని భావిస్తూ మీకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News