Allu Arjun: అల్లు అర్జున్ టార్గెట్ అయ్యారా.. ?

Allu Arjun: సినిమాల పరంగా.. రాజకీయ పరంగా అల్లు అర్జున్ టార్గెట్ అయ్యారా..? పుష్ప 2 సంఘటనతో రేవంత్ సర్కార్.. అల్లు అర్జున్ ను బూచిగా చూపిస్తూ మానవత్వం లేని మనిషి అంటూ పబ్లిక్ లో ప్రొజెక్ట్ చేసే పనిలో పడింది. మరోవైపు ఈ ఘటనతో తెలుగులో ఇకపై రిలీజయ్యే బడా సినిమాలకు టికెట్ రేట్స్ సహా ఎలాంటి ప్రీమియర్స్ కు పర్మిషన్ ఇవ్వబోమని చెప్పడంతో అటు రాజకీయంగా సినిమా పరంగా అల్లు అర్జున్ టార్గెట్ అయినట్టు కనిపిస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 23, 2024, 09:15 AM IST
Allu Arjun: అల్లు అర్జున్ టార్గెట్ అయ్యారా.. ?

Allu Arjun:సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆరుగురు నిందితులను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో మోహన్, నాగరాజు, నగేశ్ ఉన్నారు. వీరిని ఇవాళ నాంపల్లి కోర్టు లో హాజరు పరచనున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనపై డీజీపీతో మాట్లాడారు సిఎం రేవంత్ రెడ్డి. దాడి పై డీజీపీ తో ఆరా తీశారు సీఎం. అల్లు అర్జున్ ఇంటిపై దాడి వెనక రాజకీయ పార్టీల ప్రోద్బలం ఉండే అవకాశం ఉందని డీజీపీని అలెర్ట్ చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడి చేసిన నిందితులు brs నేతలతో దిగిన ఫోటో లు అందించింది ఇంటిలిజెన్స్.

అంతకు ముందు అల్లు అర్జున్‌ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి. సినీ ప్రముఖల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నట్లు ట్విట్టర్‌ వేదిక ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజిపీకి ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. సంధ్య థియేటర్‌ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు అల్లు అర్జున్ రేవంత్ సర్కార్.. అల్లు అర్జున్ ను ఇరకాటంలో పడేయడానికి ఉన్న అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఏది ఏమైనా హీరోలు.. రాజకీయ నాయకులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తమిళ హీరోలైన కమల్ హాసన్, రజినీకాంత్, విజయ్ వంటి హీరోలకు అప్పటి సీఎం దివంగత జయలలిత రుచి చూపించారు. దీంతో తమిళనాట అగ్రహీరోల అహాన్ని అణిచివేసింది. తాజాగా రేవంత్ రెడ్డి కూడా హీరోలంటే తామేదో దైవాంశ సంభూతలని చెప్పుకునే వారికి తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెప్పినట్టు కొంత మంది నెటిజన్స్ సీఎం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరోవైపు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు కావాలనే అల్లు అర్జున్ సహా సినీ నటులును టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ వరుసగా జరుగుతున్న పరిణామాలు అదే చెబుతున్నాయి. మరి ఇందులో అల్లు అర్జున్ ఎరక్కపోయి ఇరుక్కున్నాడనే మాట వినిపిస్తోంది.

తాజాగా సంధ్య థియేటర్ ఘటనలో ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. బన్నీ వాసు, అర్జున్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి.. దాదాపు రెండు కోట్లను ట్రస్టులో జమచేస్తారని తెలుస్తోంది. ఈ మొత్తాన్ని అతని వైద్యం, భవిష్యత్తు కోసం ఖర్చు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News