శునకాన్ని చూస్తే కోతికి కోపం... కోతిని చూస్తే శునకానికి కోపం.. ఎందుకంటే శునకాన్ని ఆట పట్టిస్తూ.. ఆ శునకానికి దొరక్కుండా చెట్లెక్కి కూర్చునే కోతి బుద్ది కోతుల సొంతం. అది ఆ రెండు జంతువుల మధ్య ఉన్న జాతి వైరం. కానీ ఆ శునకాలు, వానరాలు స్నేహం చేస్తే చూడ్డానికి ఆ సీన్ ఎలా ఉంటుందనడానికి నిదర్శనంగా అప్పుడప్పుడు పలు అరుదైన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఇంటర్నెట్‌లో నెటిజెన్స్‌ని ఆకట్టుకుంటోంది. శునకంతో కోతి పిల్ల, కోతి పిల్లతో శునకం పరస్పరం స్నేహభావాన్ని ప్రదర్శిస్తున్న ఆ వీడియో చూస్తే.. ఎవరికైనా ఔరా అనిపించకమానదు!! శునకం వీపుపై కోతి పిల్ల ఎక్కి కూర్చుని ఊరేగుతుంటే.. ఆ కోతిని ఏమీ అనకుండా, తాను ఎక్కడికెళ్తే అక్కడికి ఆ కోతి పిల్లను కూడా వెంట తీసుకెళ్తున్న ఆ శునకం వీడియోను చూస్తోంటే... స్నేహబంధం అనేది ఎవ్వరినైనా కట్టిపడేస్తుందని అనిపించకమానదు. మహేష్ నాయక్ అనే నెటిజెన్ ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్న ఈ వైరల్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.
Good morning all.Affection is a language which everybody can understand 😊@AnkitKumar_IFS @susantananda3 @rameshpandeyifs @Vejay_IFS @aranya_kfd @minforestmp @ParveenKaswan pic.twitter.com/gccRGZmS07
— Mahesh Naik (@MaheshN1976) February 17, 2020
అనుబంధం, ఆత్మీయత ఉంటే.. స్నేహం చేయడానికి జాతి వైరం కూడా అడ్డం రాదని నిరూపించిన ఈ వీడియో నెటిజెన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
స్నేహం చేస్తే.. నెటిజెన్స్‌ని ఆకట్టుకుంటున్న వీడియో