Telangana: 8 రోజులపాటు కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏడాది సంబరాలు.. ఏ రోజు ఏమిటో తెలుసా?

9 Days Congress Govt Anniversary Celebrations: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం 8 రోజుల పాటు సంబరాలు చేయనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ భారీ షెడ్యూల్‌ విడుదల చేయగా.. ఏ రోజు ఏముందో తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 28, 2024, 09:23 PM IST
Telangana: 8 రోజులపాటు కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏడాది సంబరాలు.. ఏ రోజు ఏమిటో తెలుసా?

Congress Govt Anniversary: పదకొండేళ్ల తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి ఏడాది పడుతూ.. లేస్తూ పూర్తి చేసుకుంటోంది. పాలనాపరంగా.. విధానపరంగా ఇంకా కుదురుకోని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పైకి మాత్రం గంభీరంగా విజయవంతమయ్యామని చెప్పుకుంటోంది. అభివృద్ధి.. సంక్షేమం సమపాళ్లలో చేసుకుంటూ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నామని చెబుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం 9 రోజుల పాటు సంబరాలు చేయాలని నిర్ణయించింది. 'ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు 2024' పేరిట షెడ్యూల్‌ విడుదల చేసింది. డిసెంబర్‌ 1 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న సంబరాల్లో ఏ రోజు ఏ కార్యక్రమం.. ఎక్కడ ఏయే కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసుకుందాం.

ఇది చదవండి: IPS Officers: 'కలెక్టర్‌ను పట్టుకుని కాంగ్రెస్‌ కార్యకర్త అంటారా?' కేటీఆర్‌పై ఐపీఎస్‌ అధికారుల ఆగ్రహం

9 రోజుల ఉత్సవాల షెడ్యూల్

డిసెంబర్ 1

  • ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ దశకు రాష్ట్రవ్యాప్తంగా శంకుస్థాపన కార్యక్రమాలు
  • విద్యార్థులకు వ్యాస రచన పోటీలు
  • సీఎం కప్ పోటీలు ప్రారంభం. (డిసెంబర్ 8 వరకు ఈ పోటీలు జరుగుతాయి)

2వ తేదీ

  • 16 నర్సింగ్, 28 పారా మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం
  • 213 కొత్త అంబులెన్సులు ప్రారంభం
  • 33 ట్రాన్స్ జెండర్ క్లినిక్‌ల ప్రారంభం.
  • ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్ల పైలట్ ప్రాజెక్టు

ఇది చదవండి: KCR: బంగారు గొలుసు ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్.. తన స్నేహితుడికి భావోద్వేగ వీడ్కోలు

3వ తేదీ

  • హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలు
  • హైదరాబాద్ శివారులోని ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభం (ఇది బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించగా తుది దశ పనులు కాంగ్రెస్‌ సర్కార్‌ చేసింది)
  • హైదరాబాద్‌లో రూ. 150 కోట్లు విలువైన బ్యూటిఫికేషన్ పనుల ప్రారంభం

4వ తేదీ

  • తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన
  • వర్చువల్ సఫారీ, వృక్ష పరిచయం కేంద్రం ప్రారంభం
  • 9,007 మందికి నియామక పత్రాల పంపిణీ (ఈ ఉద్యోగాల భర్తీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగింది)

5వ తేదీ

  • ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం
  • స్వయం సహాయక గ్రూపుల్లో చర్చలు
  • మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండలో 3 అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభం
  • ఘట్‌ కేసర్‌లో బాలికల ఐటీఐ కళాశాల ప్రారంభం

6వ తేదీ

  • యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభం (యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ కేసీఆర్‌ ప్రభుత్వం దాదాపుగా పూర్తి చేయగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తుది పనులు పూర్తి)
  • 244 విద్యుత్ ఉపకేంద్రాల శంకుస్థాపన

7వ తేదీ

  • స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం
  • పోలీస్ బ్యాండ్ ప్రదర్శన
  • తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు

8వ తేదీ

  • 7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రాజెక్టుల ప్రారంభం
  • 130 కొత్త మీ సేవల ప్రారంభం
  • యంగ్ ఇండియా యూనివర్శిటీకి శంకుస్థాపన
  • తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక వేడుకలు

9వ తేదీ

  • లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ
  • హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ మీద ముగింపు వేడుకలు
  • డ్రోన్ షో, ఫైర్ వర్క్, ఆర్ట్ గ్యాలరీ, వివిధ స్టాళ్ల ఏర్పాటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News