Eknath Shinde: మహారాష్ట్ర 15వ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే (మహాయుతి) కూటమి చరిత్రలో ఎన్నడు లేనట్టుగా 231 సీట్లలో విజయ దుందుభి మోగించింది. మరోవైపు బీజేపీ సొంతంగా 132 ఎమ్మెల్యే సీట్లు.. శివసేన షిండే గ్రూపు.. 57 శాసన సభ స్థానాలు..మరోవైపు అజిత్ పవార్ ఎన్సీపీ.. 41 సీట్లలో విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఎక్కువ సీట్లు సాధించిన తమకే ముఖ్యమంత్రి పీఠం దక్కాలని బీజేపీ పట్టు పడుతోంది. మరోవైపు ఏక్ నాథ్ షిండే మాత్రం బిహార్ ఫార్మలా ప్రకారం తమకే దక్కాలని పట్టుపడుతోంది.
అయితే.. కేంద్ర పెద్దలు జోక్యంతో ఇపుడిపుడే ఏక్ నాథ్ షిండే మెత్తబడినట్టు కనిపిస్తోంది. తమకు సీఎం పదవి రాదనే విషయం స్పష్టమైన నేపథ్యంలో బీజేపీ పెద్దల ముందు తన డిమాండ్లును పెట్టినట్టు సమాచారం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలకమైన హోం మినిష్ట్రీతో పాటు ఆర్ధిక శాఖ, ఎక్సైజ్ వంటి కీలకమైన శాఖలను కావాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. దీనిపై కేంద్ర పెద్దలు హోం శాఖ తప్పించి మిగిలిన శాఖలు అప్పగించేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. హోం శాఖకు బదులు మరో రెండు మంత్రి పదవులతో పాటు ఓ గవర్నర్ పదవితో పాటు కేంద్రంలో పలు సంస్థలకు సంబంధించిన కీలక పదవులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. శిండే శిబిరం నేతల మధ్య రాత్రి సుదీర్ఘమైన చర్చలు జరిగింది. ఈ సమావేశంలో కీలకమైన పదవులపై ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చినట్టు సమాచారం. అయితే..బీజేపీ పెద్దలు భాగస్వామ్య పక్షాల్లో ఎలాంటి చీలికలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.అంతేకాదు కూటమి నేతల డిమాండ్లను పరిష్కరించే యోచనతో పాటు కీలకమైన కార్పోరేషన్ సహా పలు కీలక పదవులను ఇచ్చేందుకు బీజేపీ హై కమాండ్ ఓకే చెప్పినట్టు సమాచారం.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter