Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారనున్నారా, ఏం జరుగుతోంది

Pawan Kalyan: జనసేనాని ఇప్పుడు బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. సనాతనం బాథ్యతల్ని తీసుకున్న పవన్ కళ్యాణ్‌ను బీజేపీ బిగ్ ప్లాన్ నడిపిస్తోందని మరోసారి అర్ధమైంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అదే జరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 19, 2024, 12:20 PM IST
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారనున్నారా, ఏం జరుగుతోంది

Pawan Kalyan: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ-తెలుగుదేశం-జనసేన కూటమి విజయం తరువాత ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఒక్కసారిగా సనాతనం అవతారమెత్తారు. తిరుపతి లడ్డూ వ్యవహారంతో సనాతన బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడూ అదే మార్గంలో ఉన్నారు. 

ప్రస్తుతం దేశమంతా మహారాష్ట్ర ఎన్నికలవైపు చూస్తోంది. కూటమి పార్టీ నేతలు మహారాష్ట్రంలో బీజేపీ-శివసేన కూటమికి మద్దతుగా ప్రచారంలో దిగుతున్నారు. ఇందులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. తనను తాను సనాతనవాదిగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా అవే అంశాలు వల్లెవేస్తున్నారు. బీజేపీ జాతీయ ఎజెండా అంశాలే ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఎజెండా ప్రచారం చేసే బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. 

పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడాలనేది బీజేపీ నిర్ణయిస్తోంది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, సనాతన ధర్మం, అయోధ్య రామాలయం వంటి అంశాల్ని బీజేపీ నేతలు ప్రస్తావించడం లేదు గానీ పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ మిత్రపక్షాలు ఈ అంశాల్ని ప్రస్తావించడం లేదు. బీజేపీ ఈ అంశాల్ని తాను స్వయంగా ప్రచారం చేయకుండా పవన్ కళ్యాణ్ చేత చెప్పిస్తోంది. బీజేపీ తాను అనుకున్నది పవన్‌తో చెప్పిస్తోందనే వాదన విన్పిస్తోంది. 

అయితే ఇది మహరాష్ట్ర ఎన్నికలకు పరిమితమయ్యేలా లేదు. జమిలి ఎన్నికలు వస్తే  ఒకే ఎజెండాతో ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్‌ను ముందు పెట్టి తన అజెండా చెప్పించే ప్రయత్నం చేయనుందని తెలుస్తోంది. మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికలతో బీజేపీ పార్టీకు మంచి బ్రాండ్ అంబాసిడర్ లభించినట్టయింది. 

Also read: New Airports: ఏపీ, తెలంగాణల్లో కొత్తగా 10 విమానాశ్రయాలు, ఎక్కడెక్కడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News